విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్‌, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 


వివరాలు...


* దూరవిద్య ప్రవేశాలు - 2022


1) డిగ్రీ కోర్సులు: 


* బీఏ


* బీకాం


* బీఎస్సీ


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.



2) పీజీ కోర్సులు: 


* ఎంఏ (ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ)


* ఎంజేఎంసీ (మాస్టర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్)


* ఎంహెచ్‌ఆర్‌ఎం (మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)


* ఎంఏ/ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్)


* ఎంఎస్సీ (ఫిజిక్స్/బోటనీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/జువాలజీ)


* ఎంకాం


* ఎంబీఏ (HRM, ఫైనాన్స్, మార్కెటింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)


* ఎంసీఏ


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.



Also Read:  నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!



3) పీజీ డిప్లొమా కోర్సులు:


* పీజీ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ & రూరల్ స్టడీస్


* పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ & అప్లికేషన్ 


* పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్


* పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లిష్


* పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్


* పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్


* పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్


* పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్


కోర్సు వ్యవధి: ఏడాది



4) సర్టిఫికేట్ కోర్సులు


* ఆఫీస్ ఆటోమేషన్ & అకౌంటింగ్


* ఆఫీస్ ఆటోమేషన్ & మల్టీమీడియా టెక్నాలజీస్


* ఆఫీస్ ఆటోమేషన్ & ఇంటర్నెట్ టెక్నాలజీస్ 


కోర్సు వ్యవధి: 6 నెలలు ఆన్‌లైన్ ప్రోగ్రాముల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నది.


Also Read: BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?


5) ఆన్‌లైన్ కోర్సులు:


* బీకాం (అకౌంటెన్సీ) 


* ఎంఏ (సోషియాలజీ) 


అర్హత: కోర్సుల మేరకు ఇంటర్‌, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2022.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.10.2022.


* రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 31.10.2022.


నోటిఫికేషన్


వెబ్‌సైట్‌


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..