దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇకపై ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రతిపాదించింది. నీట్‌-యూజీ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఈ కౌన్సెలింగ్‌ జరగాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు జూన్‌ 2న గెజిట్‌ విడుదల చేసింది.


కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎన్‌ఎంసీ జారీ చేసిన సీట్ల వివరాల జాబితా ఆధారంగానే జరగాలని, అవసరమైతే పలు దశల్లో సీట్ల భర్తీ చేపట్టవచ్చని సూచించింది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమిస్తుందని ఎన్‌ఎంసీ పేర్కొంది. 


కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను అండర్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) విడుదల చేస్తుంది. సెక్షన్-17 కింద ప్రచురించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. కౌన్సెలింగ్ కోసం ప్రభుత్వం ఒక నిర్దేశిత అధికారిని నియమిస్తుంది. 


Also Read:


దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
2023-24 విద్యాసంవత్సరానికి దేశంలో 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. వీటిలో 30 ప్రభుత్వ కళాశాలలు కాగా, 20 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 18 కళాశాలలు ఉన్నాయి. వీటిలో  తెలంగాణలో 13, ఏపీలో 5 వైద్య కళాశాలలు ఉన్నాయి. దేశంలో మొత్తం 8,195 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానుండగా.. తెలంగాణలో 1500, ఆంధ్రప్రదేశ్‌లో 750 సీట్లు పెరగనున్నాయని ఎన్ఎంసీ తెలిపింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 4 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!
తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్స్‌ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్‌ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..