తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
అక్టోబరు 15న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన నిర్వహించిన వైస్‌చాన్స్‌లర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉపాధి అవకాశాలిచ్చే ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు క్రెడిట్స్, గ్రేడింగ్ విధానంపైనా కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రస్తుతానికి మన దగ్గర డిగ్రీలో 501 కాంబినేషన్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ డిగ్రీ కళాశాలల్లో 4 లక్షలకు పైగా సీట్లుంటే ఏటా 1.5 లక్షల విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరంతా డిగ్రీ తర్వాత నైపుణ్య లేమితో ఖాళీగా ఉంటున్నారు. కోర్సులు, కరిక్యులాన్ని సమగ్రంగా మార్చడం ద్వారా ఈ పరిస్థితికి చెక్‌పెట్టవచ్చని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యే కమిటీలు
యూనివర్సిటీల్లో డ్రగ్స్, సైబర్ నేరాల నుంచి విద్యార్థులను కాపాడేందుకు డ్రగ్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని వీసీ సమావేశంలో నిర్ణయించారు. వర్సిటీ స్థాయిలోనే అవగాహన కల్పించేందుకు కమిటీని వేయనున్నారు. లీగల్ సెల్, పోలీసులు, స్వచ్ఛంద సంస్థ లు, వర్సిటీ అధికారులు, విద్యార్థి సంఘాల నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం సైబర్ నేరాలు, డ్రగ్స్ నిరోధించేందుకు వర్సిటీ స్థాయిలో రెండు క్రెడిట్స్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.
తెలుగువర్సిటీ విద్యార్థులకు యూనిక్ ఐడీ:
ప్రతి విద్యార్థికి యూనిక్ ఐడీ అమలు చేసేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్టూడెంట్ ఆథరైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నది. ఈ సాఫ్ట్‌వేర్ సేకరణకు వర్సిటీ అధికారులు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్‌టీఎస్)తో మంతనాలు జరుపుతున్నారు. ఈ విధానం ద్వారా వర్సిటీలో ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేయడంతోపాటు చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలో మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. త్వరలో రెండో విడత సీట్లను కేటాయించనున్నారు. కొన్ని కోర్సుల్లో సీట్లు పూర్తిగా నిండలేదు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులతో భర్తీచేయాలని అధికారులు నిర్ణయించారు. మొదట వచ్చిన వారికి మొదటగా సీట్లను కేటాయిస్తారు.
Also Read:
Cyber Security: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...