దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ-2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 13న రాత్రి ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.


నీట్ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా రెండో ర్యాంకుతో సత్తా చాటాడు. నీట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్‌తో అదరగొట్టారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి తర్వాత ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది.


ఈ ఏడాది నీట్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. నీట్‌కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 


నీట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో మే 7న నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసిన ఎన్టీఏ, ఆన్సర్ కీపై జూన్ 6 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ అధికారులు తాజాగా తుది ఆన్సర్‌కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.


మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 11.45,968 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా 1.39 లక్షల మంది అర్హత సాధించగా, తర్వాతీ జాబితాలో మహారాష్ట్ర 1.31 లక్షలు, రాజస్థాన్ లక్ష దాటారు. దేశంలోనే అత్యంత జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర కాగా, రాజస్థాన్ కూడా టాప్-10లో నిలిచింది. గత నెల ఏడో తేదీన విదేశాల్లో 14 నగరాలతోపాటు దేశీయంగా 499 నగరాల్లోని 4097 కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఏడుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారని ఎన్టీఏ అధికారులు తెలిపారు.


అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నీట్-యూజీ పరీక్ష నిర్వహించారు. భారత్ ఆవల అబుదాబ, బ్యాంకాక్, కొలంబో, దోహ, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియా్, షార్జా, సింగపూర్, దుబాయ్, కువైట్ సిటీల్లో నీట్ పరీక్ష నిర్వహించారు.


విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి వారికి ఎన్టీఏ.. ఆల్ ఇండియా ర్యాంకులు ఇస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ మెరిట్ ప్రాతిపదికన యూనివర్సిటీలు సీట్లు కేటాయిస్తాయి. ఆల్ ఇండియా ర్యాంకును బట్టి, విద్యార్థులు తమ రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రాల్లోనూ విద్యార్థుల మెరిట్ లిస్ట్ ప్రకారం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తాయని ఎన్టీఏ అధికారులు తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ లో తమ పాత్రమే ఉండదని ఎన్టీఏ అధికారులు చెప్పారు.


Also Read:


డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్‌, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!tru.
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..