దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ఎంట్రన్స్ కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షను మే7న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. తాజాగా నీట్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంతో దేశవ్యాప్తంగా 499 పట్టణాల్లో జరిగే ఈ పరీక్షలకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. 


గతేడాది నీట్ పరీక్షను 17.64 లక్షలమంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 18 లక్షలమంది రాసే అవకాశం ఉందని అంచనా. అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని దాంతో పాటు NTA అడిగిన డాక్యుమెంట్లు, ఫోటోలను తీసుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసేవారు ఎగ్జామినేషన్ సెంటర్ కు కనీసం గంటన్నర ముందు చేరుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్మిట్ కార్డుపై గైడ్ లైన్స్ ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేవి, అనుమతించనవి ఏవో ఉంటాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో సూచనలు కూడా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ అభ్యర్థులు పూర్తిగా చదివి అందుకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకొని పరీక్షకు హాజరు కావాలి.


దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు.


నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.


➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.


➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.


➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.


నీట్ యూజీ వివరాల కోసం క్లిక్ చేయండి..