NEET Result 2022: నేడు నీట్‌ ఫలితాలు, డైరెక్ట్ లింక్స్ ఇవిగో!

జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022  పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా 17.78 లక్షల మంది హాజరయ్యారు.

Continues below advertisement

NEET Result 2022: నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న విడుదల చేయనుంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు.  మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.


ఫలితాల కోసం వెబ్‌సైట్-1:
  https://neet.nta.nic.in/ 

ఫలితాల కోసం వెబ్‌సైట్-2: https://ntaresults.nic.in/


ఈ ఏడాది జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022  పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. ఆగస్టు 31న ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు స్కాన్‌ చేసిన చిత్రాలు వెబ్‌సైటులో అప్‌లోడ్‌ చేశారు. అభ్యర్థుల నుంచి ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత NEET UG - 2022 ఫలితాలను సెప్టెంబరు 7న విడుదల చేయనుంది.


Continues below advertisement

Also Read:  UOH PhD: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్

కటాఫ్ మార్కులు ఇలా..?
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గతేడాది కటాఫ్‌ మార్కులు జనరల్‌-138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్‌ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అప్‌లోడ్ చేయనుంది. 


నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. 


Also Read:  AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల



టై బ్రేకింగ్ ప్రకారమే ర్యాంకులు..

ఈ సారి ర్యాంకింగ్ విధానంలో టై బ్రేకింగ్ విధానాన్ని అమలుచేయనున్నారు. దీనిప్రకారం..

▶ బయాలజీ (బోటనీ & జువాలజీ), కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు/పర్సెంటైల్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటంది. 

▶ అన్ని సబ్జెక్టులలో మార్కులు ఒకేలా ఉంటే, తక్కువ ప్రశ్నలకు ప్రయత్నించిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది, తరువాత బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్‌లలో తక్కువ తప్పులు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.

▶ ఈ మార్కులన్నీ కూడా సరిపోలితే, వయసులో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది.

▶ ఒకవేళ అభ్యర్థులు తమ పుట్టినరోజును పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ఎక్కువ ర్యాంకు లభిస్తుంది. 

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement