ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్), ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. పరీక్షలో అర్హత సాధించినవారికి దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 22న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* ఐసీఏఆర్- ఏఐఈఈఏ పీజీ-2023
విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ & నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్ .
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.08.2023 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1175; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1150; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.600.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.05.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 16.06.2023.
* దరఖాస్తుల సవరణ: 18.06.2023 నుంచి 20.06.2023 వరకు.
Also Read:
హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో ప్రవేశాలు!
తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్స్ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ కళాశాలలో బాలికలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..