తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్స్‌ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్‌ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. 


ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 


విద్యార్థులు సంప్రదాయ కోర్సుల సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే సైన్స్‌ కాకుండా హ్యూమనిటీస్‌ గ్రూప్‌లు చదివిన విద్యార్థులు డ్యూయల్‌ డిగ్రీ కోర్సులకు ఆసక్తి చూపుతున్నారని  ట్రిపుల్‌ఐటీ సంచాలకులు ప్రొఫెసర్‌ పీజే నారాయణన్‌ పేర్కొన్నారు. గతేడాది దరఖాస్తు చేసుకున్న 20 వేల మందిలో 2 వేల మంది హ్యూమనిటీస్‌ను ఎంచుకున్నారని వివరించారు.


Website


కోర్సు గురించి వివరాలు..


Also Read:


జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జూన్ 4న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ గువాహటి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 4న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. 
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.. 


నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు క్యాట్ లేదా మ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్/ మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 19 వరకు అవకాశం ఉంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవ‌చ్చని ఆర్టీసీ ఎండీ స‌జ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవ‌చ్చు. ఈ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్రమే ప్రవేశం క‌ల్పించ‌నున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..