తెలంగాణలో ఈసారి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క కన్వీనర్ కోటా విభాగంలోనే ఈ ఏడాది 7 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంసెట్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా కింద 82 వేలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 


గత విద్యాసంవత్సరం వరకు కన్వీనర్ కోటా కింద 55 వేల లోపే  సీట్లు భర్తీ అయ్యేవి. వీటిలో 3, 4 వేల స్పాట్ ప్రవేశాలు ఉండేవి. కాని ఈ ఏడాది కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 79,346 సీట్లలో 62,100 (78.26 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో దాదాపు 4 వేల మంది స్పాట్ ప్రవేశాల్లో సీట్లు పొందారు. ఇక మేనేజ్‌మెంట్ కోటా కింద ఏటా 14 వేల నుంచి 18 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేవారు. అయితే ఈ సంవత్సరం 20 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశముంది.


ప్రవేశాల పెరుగుదలకు కారణమిదే..!
ఈ ఏడాది బీటెక్‌లో ప్రవేశాలకు ప్రధాన కారణం కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి పలు కొత్త బ్రాంచ్‌లను ప్రవేశ పెట్టడమే. ఇప్పటివరకు డిమాండ్ లేని బ్రాంచ్‌ల స్థానంలో 9 వేలకుపైగా కొత్త బ్రాంచీల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో చదివినా తిరిగి ఐటీ వైపుకే మళ్లాల్సి వస్తోంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు దక్కినా జీతాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సీఎస్ఈ, దానికి అనుబంధ బ్రాంచ్‌లలో చేరేవారి సంఖ్య ఈసారి విపరీతంగా పెరిగింది.


ప్రైవేట్ వర్సిటీల్లో మరో 10 వేల మంది ప్రవేశాలు.. 
రాష్ట్రంలో ఇంతకు ముందు వరకు 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండగా, ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి మరో 5 యూనివర్సిటీలకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్ కూడా అసెంబ్లీలో పాస్ అయింది. దీంతో గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలు ఈ ఏడాది ప్రవేశాలు జరిపాయి. దీంతో మొత్తం ప్రైవేట్ వర్సిటీల్లో కలిపి దాదాపు 10 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీల్లో 2,800 మంది విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. అయితే ప్రైవేట్ వర్సిటీల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలపకపోతే వారి పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. 


Also Read: 


వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?
IIT Job Placements: రెసిషన్‌ భయం ఓవైపు కమ్మేస్తుంటే... గ్లోబల్‌ కంపెనీలు మాత్రం రికార్డ్‌ రేంజ్‌ ఆఫర్లతో IITల ఎదుట క్యూ కట్టాయి. ప్రస్తుతం IITల్లో ఫస్ట్‌ ఫేజ్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ జరుగుతున్నాయి. తమకు పనికొస్తాడు అనుకున్న వాళ్లకు కోట్ల రూపాయల జీతం ఇస్తామంటూ ఊరిస్తున్నాయి. చేస్తున్నాయి. గతేడాది రికార్డులను తుడిచేస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 19 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే  రూ.120 ఆలస్య రుసుముతో డిసెంబరు 26 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో జనవరి 17 వరకు, రూ.3,000 ఆలస్య రుసుముతో జనవరి 23 వరకు, రూ.5,000 ఆలస్య రుసుముతో జనవరి 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.700 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్‌-2022' కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్‌ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబరు 3 నుంచి 10  వరకు వెబ్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 4 నుండి 12 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 12న స్పెషల్‌ కేటగిరి అభ్యర్ధుల సరిఫికెట్లను ఫిజికల్‌గా నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.