KIPS LEARNING Workshop In Hyderabad: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, కోడింగ్‌పై పట్టు కేవలం టెక్కీలకే కాదు ఈ జమానాలో జాబ్ చేస్తున్న వారందరికీ అవసరమే. అందులో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. భవిష్యత్ భారతాన్ని తరగతు గదుల్లో తీర్చి దిద్దుతున్న గురువులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, కోడింగ్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే KIPS LEARNING ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఓ వర్క్‌షాప్ నిర్వహించారు. గురువులకు అవసరమైన నైపుణ్యాలు అందించి భవిష్యత్తు కోసం సన్నద్దత చేయడమే ఈ వర్క్‌షాపు ముఖ్య లక్ష్యం.
స్ఫూర్తిదాయకంగా నిలిచిన వర్క్‌షాప్‌లో విద్యలో పెరుగుతున్న డిజిటల్ అక్షరాస్యత, దీని ఆవశ్యకతను వివరించారు. డిజిటల్ అక్షరాస్యతకు పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టుగా సన్నద్ధమవడం ఎలా అనే అంశంపై చర్చించారు. సాంకేతికతతో నడిచే స్టడీ ఎన్విరాన్మెంట్ కోసం జ్ఞానం పెంపొందించుకోవడం, దీని కోసం యూజ్ చేయాల్సిన మెటీరియల్‌పై అవగాహన కల్పించడం కోసం ఈ ఈవెంట్ ప్రత్యేకంగా రూపొందించారు.
లేటెస్టు ఎడ్యుకేషన్ టెక్నాలజీపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో 150 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రయోగాత్మక శిక్షణ, నిపుణుల సలహాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు మంచి అనుభూతిని ఇచ్చాయి. బోధనా వ్యూహాలు, డిజిటల్ అక్షరాస్యత మెరుగుపరచడం, AI, రోబోటిక్స్, కోడింగ్‌లో ప్రాథమిక అంశాలు కవర్ చేశారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య-పరిష్కార నైపుణ్యాలు ప్రోత్సహించడానికి ప్రస్తుత పాఠ్యాంశాల్లో సాంకేతికత ఎలా జోడించ వచ్చో విద్యావేత్తలు వివరించారు
KIPS LEARNING వినూత్న పాఠ్యాంశాలు, KIPS ELEVATE CODE PIXEL, AI, రోబోటిక్స్, కోడింగ్ నైపుణ్యాలను బోధనలో పొందుపరచడానికి కొత్త కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, KIPS LEARNING ప్రెసిడెంట్ వేణుగోపాల్ భాస్కరన్... టెక్నాలజీ-కేంద్రీకృత నైపుణ్యాలతో గురువుల ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. "నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో AI, రోబోటిక్స్, కోడింగ్ అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఇది ఆప్షన్ కాదు. తప్పనిసరి అయిపోయింది. CODE PIXEL ఈ నైపుణ్యాల అవసరాన్ని వివరిస్తుంది" అని Mr. భాస్కరన్ అన్నారు.
Also Read: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఖాళీలు ఎన్నో తెలుసా?
అధ్యాపకుల మద్దతుకు కృతజ్ఞతలు చెప్పిన భాస్కరన్ దేశవ్యాప్తంగా 10,000 పాఠశాలలతో కిప్స్ లెర్నింగ్ భాగస్వామ్యం ఉందని వివరించారు. డిజిటల్ అక్షరాస్యత విస్తరించడంలో సంస్థ నిబద్ధత తెలియజేశారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన వారంతా సమగ్ర పాఠ్యాంశాలు, ఆచరణాత్మక విధానాన్ని ప్రశంసించారు, చాలామంది తమ తరగతి గదుల్లో సాంకేతికత పద్ధతులు అమలు చేయడానికి ఇదో ప్రేరణగా ఉందన్నారు.
విద్యలో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి కృషి చేస్తున్న కిప్స్ లెర్నింగ్ సంస్థ... భారతదేశం వ్యాప్తంగా ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని భావిస్తోంది. అధ్యాపకుల్లో అత్యాధునిక నైపుణ్యాలు పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉంచడం, కొత్త తరం టెక్-అవగాహన ఉన్న అభ్యాసకులను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది.