Biometric-Enabled Digital Life Certificate: పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రాన్ని ఏటా నవంబర్ నెలలో సమర్పించాలి. నవంబర్ 30వ తేదీలోగా ఈ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాలి. పెన్షన్ డిపార్ట్‌మెంట్ లేదా బ్యాంక్‌ల తరహాలోనే, ఇపుడు పోస్టాఫీస్ కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది, పెన్షనర్‌ల 'బయోమెట్రిక్-ఆధారిత డిజిటల్ సర్వీస్". కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లేదాఇతర ప్రభుత్వ ఏజన్సీ నుంచి పెన్షన్ పంపిణీ తీసుకుంటున్న పింఛనర్లు ఈ ఫెసిలిటీని పొందొచ్చు, హాయిగా ఇంట్లో కూర్చునే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సమర్పించొచ్చు.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) రూపొందించిన యాప్ ద్వారా DLC సర్వీస్‌ను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అందిస్తోంది.
"బయోమెట్రిక్-ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్" వల్ల ప్రయోజనాలు
వేలిముద్రలు (fingerprint) & ముఖ గుర్తింపు (face authentication)తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పూర్తిగా కాగితరహితంగా (paperless) జారీ అవుతుంది
పెన్షన్ డిపార్ట్‌మెంట్‌కు గానీ, బ్యాంక్‌కు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు
మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా పోస్ట్‌మెన్ ద్వారా మీ ఇంటి వద్దే ఈ సర్వీస్ పొందొచ్చు
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వివరాలు నేరుగా పెన్షన్ డిపార్ట్‌మెంట్ దగ్గర అప్‌డేట్ అవుతాయి
పన్నులతో కలిపి, కేవలం రూ. 70 ఫీజ్ చెల్లిస్తే చాలు
పెన్షనర్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు/ DLC ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి?
మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లిగానీ లేదా పోస్ట్‌మ్యాన్/గ్రామీన్ డాక్ సేవక్‌ను మీ ఇంటికే వద్దకే పిలిచి ఈ సేవలు పొందొచ్చు.
పోస్టాఫీస్/పోస్ట్‌మ్యాన్/గ్రామీన్ డాక్ సేవక్‌కు మీ పెన్షన్ ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వివరాలు అందించాలి
పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO)
పెన్షన్ పంపిణీ డిపార్ట్‌మెంట్ (Pension Disbursing Department)
బ్యాంక్ ఖాతా వివరాలు (Bank Account Details)
మొబైల్ నంబర్ (Mobile number)
ఆధార్ నంబర్ (Aadhar Number)
బయోమెట్రిక్ (వేలిముద్ర లేదా ముఖం) స్కాన్ కోసం మీ రిక్వెస్ట్‌ను ఆథరైజ్ చేయాలి
ఇప్పుడు, SMS ద్వారా అందిన ప్రమాణ్ IDతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జెనరేట్ అవుతోంది. మీ వివరాలు పెన్షన్ డిపార్ట్‌మెంట్ సర్వర్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.
DLC కోసం ముందస్తుగా ఏమేం అవసరం?
పెన్షనర్‌కు తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఉండాలి
పెన్షనర్ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి
పెన్షన్ పంపిణీ ఏజెన్సీ (బ్యాంకు/పోస్టాఫీస్ వంటివి) దగ్గర ఇప్పటికే ఆధార్ నంబర్ నమోదు చేసి ఉండాలి
పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నెలాఖరు కల్లా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. ఈ డెడ్‌లైన్ దాటితో వారి పెన్షన్ నిలిచిపోతుంది. సాధారణంగా, పెన్షనర్లు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. వాళ్లు పెన్షన్ పంపిణీ డిపార్ట్‌మెంట్ లేదా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ వరకు వెళ్లి DLC సమర్పించగలిగే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తులకు ఇంటి వద్దే DLC సర్వీస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం "బయోమెట్రిక్-ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్" విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోంది, DLC సమర్పణ పనిని చాలా సులభంగా మార్చింది.
మరో ఆసక్తికర కథనం: పండుగ టైమ్‌లో పసిడి ధర పతనం - ఈ రోజు మీ ఏరియాలో రేట్లు ఇవీ