JEE-Main Exam 2022 Date: జేఈసీ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ - కీలక తేదీలు ఇవే..

జేఈసీ మెయిన్స్ షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల మండలి విడుదల చేసింది. రెండు విడతల్లో నిర్వహించనుంది.

Continues below advertisement

 జెఈఈ మెయిన్స్  ( JEE Mains ) పరీక్షలకు షెడ్యూల్ ను జాతీయ పరీక్షల మండలి  ( NTA )  మంగళవారం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఈ పరీక్షలు రెండు విడతలలో  మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మొదటి విడత ఏప్రిల్ 16 నుండి 21 వరకు, రెండో విడత మే 24 నుండి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఎన్.టి.ఎ సీనియర్ డైరెక్టర్ డా.సాధనా పరాషర్ వెల్లడించారు.  దేశంలోని ఎన్.ఐ.టిలలో ప్రవేశానికి, జెఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసే అర్హులను నిర్ణయించే ఈ పరీక్షలకు దరఖాస్తులు చేసుకుంటారు. మార్చి 1 నుండి 31 వ తేదీ సాయంత్రం 5గం.ల వరకు ఆన్లైన్ లో ( Online )  దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే ఐఐటిల్లో బిటెక్ ప్రవేశాలకు నిర్వహించే జెఈఈ అడ్వాన్స్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు.  

Continues below advertisement

 JEE-Main first phase to be conducted from April 16-17, second phase scheduled from May 24-29: National Testing Agency

ఎన్‌ఐటీల్లో  ఇంజనీరింగ్ ( Engineering ) చేరే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ( JEE ) మెయిన్స్ పరీక్షలను ఈ సారి రెండు సార్లు మాత్రమే నిర్వహిస్తున్నారు.  కరోనా కారణంగా గతేడాది JEE మెయిన్స్ పరీక్షను నాలుగు సార్లు నిర్వహించారు.  ఈ సారి జేఈఈ మెయిన్స్‌ పరీక్షను కేవలం రెండుసార్లు మాత్రమే రాయడానికి విద్యార్థులకు అనుమతి ఇచ్చారు.   

సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 1 రిజల్ట్స్‌ ఎప్పుడు వస్తాయి ! బోర్డు అధికారి ఏమన్నారంటే

పరీక్షలకు వయో పరిమితి లేదు. కానీ, 2020, 2021లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ ( Inter ) పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ( locak languages ) ఎగ్జామ్ రాసే వీలుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నారు. ఈ సారి మాత్రం కాస్త తక్కువ సమయమే ఉన్నప్పటికీ కరోనా భయాలు లేకపోవడం విద్యార్థులకు టెన్షన్ లేకుండా చేస్తోంది. 

Continues below advertisement