వైఎస్ వివేకానందరెడ్డి హత్య ( YS Viveka Murder Case )  కేసులో వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు కుట్రేనని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) ఆరోపించారు. సీబీఐకి పలువురు అనుమానితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతూండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టారు. వైఎస్‌ వివేకా హత్యపై టీడీపీ ( TDP ) దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో రాజకీయరంగు పులుముతున్నారని ఆరోపించారు. ఎంత బురదజల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నామని వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. 


వార్డు సచివాలయ ఉద్యోగులకు సులభ్ కాంప్లెక్స్ డ్యూటీలు - రోజుకు రూ. 5వేలు టార్గెట్ కూడా !



వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ( YS Sunita ) ఎలాంటి ఆధారలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ( Chandra babu ) చేతిలో పావుగా మారారని సజ్జల ఆరోపించారు.  వివేకా హత్యపై  జరుగుతున్న ప్రచారాన్ని రాజకీయ కుట్రగా చూస్తున్నామని సజ్జల ( Sajjala ) ప్రకటించారు.  ఒకరి తర్వాత ఒకరు పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని  వెనకుండి చంద్రబాబే నాటకమాడిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. 


ఎటెళ్లాలో తెలియడం లేదు, ఎటు చూసినా బాంబు పేలుళ్లే- ఖార్కివ్‌లో విద్యార్థుల ఆవేదన


వైఎస్ వివేకా హత్య కేసులో  అవినాష్‌రెడ్డిపై ( Avinash Reddy ) ఆరోపణలు కుట్రపూరితమేనని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు  మూడేళ్లుగా కుట్రలు పన్నడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్సించారు.  ప్రజల్లో విషం ఎక్కించే కుట్ర జరుగుతోందని జగన్‌ను  నేరుగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని  ఆరోపించారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేకా కుమార్తె అని ప్రచారంలో ఉందని కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆ పార్టీలోకి వెళ్లాలంటే వెళ్లొచ్చు. కానీ వ్యక్తిగత హననం సరికాదని సునీతకు సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా కుమార్తె, అల్లుడిని కలుపుకుని​ చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారని  విమర్శించారు. 


ఎన్డీఏ నుంచి బయటకు రాగానే చంద్రబాబులా సీబీఐకి నో ఎంటీ అని మేం చెప్పలేదని.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం కూడా స్వాగతించిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడని ఇప్పటికీ సజ్జల చెబుతున్నారు.