దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ‌ల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ కీని ఐఐటీ గువాహటి ఆదివారం (జూన్ 11) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు జూన్ 12న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు.  విద్యార్థులు తమ ఫీడ్ బ్యాక్ తెలిపేందుకు ప్రత్యేకంగా లింక్‌ను ఏర్పాటుచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను వచ్చే జూన్ 18న విడుదల చేయనున్నారు.


జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్‌-1 ప్రొవిజినల్ కీ కోసం క్లిక్ చేయండి..

జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్‌-2 ప్రొవిజినల్ కీ కోసం క్లిక్ చేయండి..


ఆన్సర్ కీ అభ్యంతరాల (ఫీడ్ బ్యాక్) కోసం క్లిక్ చేయండి..


జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) నిర్వహించారు. వారణాసి, ఖరగ్‌పూర్‌, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌)కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్‌ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్‌ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.


Also Read:


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
2023-24 విద్యాసంవత్సరానికి దేశంలో 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. వీటిలో 30 ప్రభుత్వ కళాశాలలు కాగా, 20 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 18 కళాశాలలు ఉన్నాయి. వీటిలో  తెలంగాణలో 13, ఏపీలో 5 వైద్య కళాశాలలు ఉన్నాయి. దేశంలో మొత్తం 8,195 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానుండగా.. తెలంగాణలో 1500, ఆంధ్రప్రదేశ్‌లో 750 సీట్లు పెరగనున్నాయని ఎన్ఎంసీ తెలిపింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 4 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..