జేఈఈ మెయిన్ నాలుగో సెషన్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ కానుంది. ఈరోజు (సెప్టెంబర్ 15) సాయంత్రం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దరఖాస్తు స్వీకరణ గడువు సెప్టెంబర్ 21తో ముగియనుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ పరీక్షలను నిర్వహిస్తోంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జేఈఈ నాలుగో సెషన్ ఫలితాలను ప్రకటించకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు.. అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను అక్టోబర్ 3వ తేదీన రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు.. రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు ఉంటుంది.


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పూర్తి షెడ్యూల్..
దరఖాస్తు ప్రారంభ తేదీ - 15 సెప్టెంబర్ 2021 (సాయంత్రం)
దరఖాస్తుకు చివరి తేదీ - 20 సెప్టెంబర్ 2021 (సాయంత్రం 5 గంటల వరకు)
ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ - 21 సెప్టెంబర్ 2021 (సాయంత్రం 5 గంటల వరకు)
ప్రవేశ పరీక్ష తేదీ - 3 అక్టోబర్ 2021


జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల..
జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు. ఇక 44 మంది 100 పర్సంటైల్ దక్కించుకున్నారు. జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయబావుటా ఎగురవేశారు. ఏపీకి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఇద్దరు ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఏపీకి చెందిన పసల వీరశివ, దుగ్గినేని వెంకట పణీష్‌, కంచనపల్లి రాహుల్‌ నాయుడు, కర్నం లోకేశ్‌.. తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యలకు ఫస్ట్ ర్యాంకు దక్కించుకున్నారు. 


Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు


Also Read: AP Inter Betterment Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్‌.. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉంది