ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ ప్రియుల ఎదురుచూపులకు తెరపడింది. యాపిల్ CEO టిమ్ కుక్ మంగళవారం కాలిఫోర్నియలో 5జీ iPhone 13 సిరీస్‌ను విడుదల చేశారు. ఐఫోన్‌ 13 సిరీస్‌లో ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7, ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్‌ 2021లనూ ఆవిష్కరించింది.




Also Read: iPhone 13 Series: ఐఫోన్ 13 సిరీస్ వ‌చ్చేసింది.. ముందు వెర్ష‌న్ల కంటే త‌క్కువ ధ‌ర‌కే!


కొత్తగా తీసుకువచ్చిన  ఐఫోన్‌ 13 ధర 699 డాలర్ల నుంచి, 13 ప్రో 999 డాలర్లు, 13 ప్రోమాక్స్‌  1099 డాలర్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక భారత కరెన్సీలోకి వస్తే ఐఫోన్‌ 13 మినీ రూ.69,900, 13 రూ.79,900, 13 ప్రో రూ.1,19,900, 13 ప్రో మ్యాక్స్‌ రూ.1,29,900 నుంచి ధరలతో ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనే కదా మీ సందేహం. 


Also Read: Apple New iPad, iPad Mini: యాపిల్ కొత్త ఐప్యాడ్లు వ‌చ్చేశాయ్.. ఈసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లోనే!


ఈ కొత్త ఐఫోన్ల ధరలు చూసి సామాన్యులు అమ్మో ఇంత ధరా అని అనుకుంటున్నారు. ఈ ఫోన్లు కొనడం తమకి అందని ద్రాక్షే అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ బ్రాండ్‌కి ఉన్న ఇమేజ్ అలాంటిది. ఐఫోన్ నుంచి వచ్చిన 10 మోడల్స్ ధరలు లక్ష రూపాయలలోపే ఉన్నాయి. వీటిలో నాలుగు మోడల్స్ ధర రూ.60వేల లోపు. ఇంతకీ అవేంటి. ఏ మోడల్సో ఇప్పుడు చూద్దాం. 



iPhone X series


iPhone XS ₹59,999
iPhone XS Max ₹69,586
iPhone XR ₹42,999


iPhone 11 series


iPhone 11 ₹56,900
iPhone 11 Pro ₹79,999
iPhone 11 Pro Max ₹94,900


iPhone 12 series


iPhone 12 Mini ₹59,990
iPhone 12 ₹78,950
iPhone 12 Pro ₹1,06,900
iPhone 12 Pro Max ₹1,15,900


iPhone 13 series


iPhone 13 Mini ₹69,900
iPhone 13 ₹79,900
iPhone 13 Pro ₹1,19,900
iPhone 13 Pro Max ₹1,29,900


ఇంకెందుకు ఆలస్యం... మరి, వీటిలో మీ బడ్జెట్లో వచ్చే ఐ ఫోన్ ఏదో సెలక్ట్ చేసుకోండి.