ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్)- ఆలిండియా కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 22న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


* ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023


స్పెషలైజేషన్: జెనెటిక్స్ అండ్‌ ప్లాంట్ బ్రీడింగ్, సీడ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ప్లాంట్ పాథాలజీ, నెమటాలజీ, ఎంటమాలజీ, సెరికల్చర్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, వెజిటబుల్ సైన్స్, ఫ్రూట్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్ మొదలగునవి.


అర్హత:  సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31.08.2023 నాటికి 20 సంవత్సరాలు నిండి ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: జనరల్/ యూఆర్‌ అభ్యర్థులకు రూ. 1875; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 1850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.950.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120. గరిష్ఠ మార్కులు 480.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 16.06.2023.


* దరఖాస్తు సవరణ తేదీలు: 18.06.2023 నుంచి 20.06.2023 వరకు.


Notification


Online Application


Website


Also Read:


నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌, విభాగాలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్‌/ క్యాట్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఇన్‌స్పైర్‌/ నెట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలు గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!
తెలంగాణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల వయసు కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు జూన్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..