తెలంగాణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల వయసు కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు జూన్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఐటీఐ ప్రవేశాలు (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్)
ట్రేడ్లు: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, డ్రెస్ మేకింగ్, ఫ్యాషన్ డిజైన్ & టెక్నాలజీ, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఐవోటీ టెక్నీషియన్, మెకానిక్ ఆటో బాడీ పెయింటింగ్, మెకానిక్ ఆటో బాడీ రిపేర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, మెకానిక్ డీజిల్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, సీవింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, సోలార్ టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ & సెక్రటేరియల్ అసిస్టెంట్, డెంటల్ ల్యాబొరేటరీ ఎక్విప్‌మెంట్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, పెయింటర్, రేడియాలజీ టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్ & ఏసీ టెక్నీషియన్, స్మార్ట్‌ఫోన్ టెక్నీషియన్ కమ్ ఆప్ టెస్టర్.
అర్హత: 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 10.06.2023.
Also Read:
టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ కళాశాలలో బాలికలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బాసర ట్రిపుల్ ఐటీ షెడ్యూల్ విడుదల, జూన్ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్ కేటగిరీ కింద పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..