ఐసీఏఐ సీఏ నవంబరు ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జనవరి 10న ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. సీఏ ఫైనల్ పరీక్షలను నవంబరు 1 నుంచి 16 వరకు, సీఏ ఇంటర్ పరీక్షలను నవంబరు 2 నుంచి 17 వరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను తాజాగా వెల్లడించారు.
సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు ఇలా చూసుకోండి..
స్టెప్-1: ఫలితాల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-icai.nic.in.
స్టెప్-2: అక్కడ హోంపేజీలో 'CA Final and CA Inter Results' ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: అక్కడ లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రోల్ నెంబర్/రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-5: ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
స్టెప్-6: ఫలితాలు డౌన్‌లోడ్ చేసకొని ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Result Link: సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ ఇదే..
Also Read:
గేట్-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయి. ఐఐటీ కాన్పూర్ జనవరి 9న గేట్-2023 హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి జనవరి 3న అడ్మిట్ కార్డులు విడుదల చేయాల్సి ఉంది. అయితే నిర్వహణపరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటకనలో తెలిపింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఆ మేరకు తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు.
గేట్-2023 అడ్మిట్ కార్డు, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎఫ్‌డీడీఐలో బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ కోర్సులు - ప్రవేశ వివరాలు ఇలా!
ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) 2023-24 విద్యాసంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యాసంస్థల్లో ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్ యాక్సెసరీలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2023 పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..