తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్/ యూజీసీ- నెట్/ సీఎస్‌ఐఆర్- నెట్/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్/ యూజీసీ- నెట్/ సీఎస్‌ఐఆర్- నెట్/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.10.2023.
ALSO READ:
తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు
ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజీప్ బుధవారం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో ఈసారి భారత్‌కు చెందిన 91 యూనివర్సిటీలకు చోటు దక్కింది. గత ఏడాది 75 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. బెంగళూరులోని ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc)కు భారత్‌లోని ఉత్తమ వర్సిటీగా మరోసారి నిలిచింది. ఈ వర్సిటీకి ఈ ర్యాంకుల్లో 250వ ర్యాంకు దక్కింది. 2017 తర్వాత మరోసారి ఈ ర్యాంకు లభించింది. 108 దేశాల్లోని 1904 విశ్వవిద్యాలయాలు ఈసారి ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..