Watch Video: 


మహిళపై దాడి..


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళను దారుణంగా వేధించాడో వ్యక్తి. సెప్టెంబర్ 25న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వీడియోలు వైరల్ అయ్యాయి. ఓ స్పా బయట మహిళపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని లాగుతూ వేధించాడు నిందితుడు. ఈ వీడియోల ఆధారంగా సెప్టెంబర్ 27న కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడు మోసిన్ గ్యాలక్సీ స్పా ఓనర్. తన బిజినెస్ పార్ట్‌నర్ అయిన మహిళపై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడు. స్పా ఎదుట ఉన్న CC కెమెరాలో ఈ దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దాదాపు నాలుగు నిముషాల పాటు ఆమెపై దాడి చేశాడు. బట్టలు చింపాడు. జుట్టు పట్టుకుని లాగాడు. ఈ వీడియోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే...ఇప్పటి వరకూ ఆ బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా తమ వద్దకు రాలేదని వివరించారు. ఓ సోషల్ వర్కర్ సాయంతో బాధితురాలిని కలిశారు. కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆమె మోసిన్ బిజినెస్ పార్ట్‌నర్ అయిన విచారణలో తేలింది. 






పెరుగుతున్న స్పా సెంటర్‌లు..


ఓ చిన్న విషయంలో వాగ్వాదం మొదలైందని, అది కాస్తా ఇలా దాడి చేసుకునేంత వరకూ వచ్చిందని బాధితారులు చెప్పింది. ఈ దాడి జరిగినప్పుడు పక్కన కొందరున్నారు. అయినా పట్టించుకోలేదు. అహ్మదాబాద్‌లో స్పా సెంటర్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ సెంటర్‌లలో మహిళలు పని చేస్తున్నారు. కొందరు నేపాల్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగం వెతుక్కుంటున్నారు. చివరకు వీళ్లు ఇలా బాధితులవుతున్నారు. వేధింపులు, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో దాదాపు అలాంటిదే. 


Also Read: మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు