పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కల్యాణిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీకే) ఎగ్జిక్యూటివ్ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ఎంఎస్సీ, ఎంఎస్‌, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 16 వరకు అవకాశం ఉంది.


వివరాలు..


* ఎగ్జిక్యూటివ్ ఎంటెక్‌ ప్రోగ్రామ్- జులై 2023


స్పెషలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ డేటా సైన్స్.


సీట్ల సంఖ్య: 30.


అర్హత: బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ/ఎంఎస్‌(సీఎస్‌, ఐటీఐ, ఈసీఈ, ఈఈ)/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.500. అభ్యర్థులు 'CONTINUING EDUCATION PROGRAMME (CEP) IIIT KALYANI' పేరిట కల్యాణిలో చెల్లుబాటు అయ్యేలా డిడి తీయాలి. (లేదా) అకౌంట్ నెంబరు: 40031861091, IFSC Code: SBIN0006701కు రూ.500 డిపాజిట్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్ ప్రూఫ్ భద్రపరచుకోవాలి. 


ముఖ్యమైన తేదీలు:


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.06.2023.


➥ హార్డ్‌కాపీ దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ: 23.06.2023.


➥ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 07.07.2023.


➥ ఎంపికైన అభ్యర్థుల ప్రకటన: 10.07.2023.


Notification


Application Form


Website


Also Read:


నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌, విభాగాలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్‌/ క్యాట్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఇన్‌స్పైర్‌/ నెట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలు గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!
తెలంగాణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల వయసు కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు జూన్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
 


టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవ‌చ్చని ఆర్టీసీ ఎండీ స‌జ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవ‌చ్చు. ఈ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్రమే ప్రవేశం క‌ల్పించ‌నున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..