Telangana Politics :   తెలంగాణ సీనియర్ రాజకీయ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారన్నదానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది.   ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ నిర్వహించారు.  గన్‌మెన్లను కూడా తీసుకెళ్లకుండా  ఈటల జూపల్లి, పొంగులేటితో ఏం చర్చించా రనన్న అంశంపై ఉత్కంఠ రేపుతోంది. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఈ ఇద్ద‌రిని హ‌స్తం గూటికి చేర్చేందుకు త‌మ వంతు ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసింది.. దీంతో ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌ల్ల‌గుల్ల‌లు ప‌డుతున్నారు. 


బలమైన నేతల కోసం బీజేపీ ఆరాటం 


అసెంబ్లి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసం తృప్తి నేతలే టార్గెట్‌గా ఆ పార్టీ ప్రయ త్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో బలమైన నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీ యాల్లో కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా బీజేపీలోకి తీసుకు రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే బీజేపీలో చేరే విషయమై పొంగులేటి, జూపల్లి తేల్చకపో వడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతోంది. హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకు పొంగులేటి, జూపల్లితో ఈటల సమావేశం అయినట్లుగా చెబుతున్నారు. అలా అయితే అందులో రహస్యం ఎందుకని కొంత మంది డౌట్.                


ముగ్గురూ కలిసి కొత్త పార్టీపై చర్చ పెట్టారా ?                 
 
పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నా రని, ఆ క్రమంలోనే ఈటల వారితో రహస్య భేటీ జరిపినట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త నేతల చేరికలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. కొత్త నేతల చేరడం అటుంచితే పార్టీ లో ఉన్న నేతలు కూడా చేజారే ప్రమాదముందన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈటలపై బీజేపీ శ్రేణుల్లోనే అనుమానాలు నెల కొనడంతో పొంగులేటి, జూపల్లితో జరిగిన చర్చల్లో వారిని బీజేపీకి ఆహ్వానించే అంశాన్ని చర్చించారా..? లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో పరోక్షంగా ప్రయోజనం కలిగించే ప్రత్యామ్న్యాయాలపై ఈటల వారితో చర్చించారా..? అని కొంత మంది బీజేపీ రాష్ట్ర నేతలు అనుమానపడుతున్నారు. 


కాంగ్రెస్ లో చేరుతారని ధీమా వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి                     


తమ నిర్ణయాన్ని పొంగులేటి, జూపల్లి ప్రకటించకపోవడంతో వారి రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉమ్మడి శత్రువైన బీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించడాని  బీజేపీ దగ్గరున్న వ్యూహాలు, తెలంగాణలో బీజేపనీకి ఉన్న బలం, ప్రజల్లో ఆదరణ, ఎన్ని సీట్లలో గెలుపు సాధ్యం తదితర అంశాలపై  పొంగులేటి, జూపల్లి కి అనుమానాలున్నాయి. కాంగ్రెస్ కు గ్రామ గ్రామాన క్యాడర్ ఉండటంతో పాటు కర్ణాటక ఎన్నికల తర్వాత ఓ వేవ్ వచ్చింది. ఈ కారణంగా ఆ పార్టీ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.రేవంత్ రెడ్డి వారు వస్తారని  గట్టి నమ్మకంతో ఉన్నారు.