ICSE and ISC Result 2026:భారత్‌లోని లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ICSE -పదో తరగతి), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ISC 12వ తరగతి) పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30 గురువారం నాడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ప్రకటన విద్యార్థుల భవిష్యత్‌కు మైలురాయి కానుంది.
ఎప్పుడు, ఎక్కడ ఫలితాలు అందుబాటులో ఉంటాయి?
ఐసీఎస్‌ఈ, ఐఎస్సీ 2026 పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ మార్కులను కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు కింది వెబ్‌సైట్‌లను సందర్శించాల్సి ఉంటుంది. cisce.org, results.cisce.org, గురువారం ఫలితాలు విడుదల కాగానే వెబ్‌సైట్‌లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున,ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
Also Read: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
వెబ్‌సైట్ ద్వారా మీ స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోడానికి ఈ దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ results.cisce.org ఓపెన్ చేయండి. హోమ్ పేజ్‌లో కనిపించే 'ICSE Scorecard 2026" లేదా "ISC Scorecard 2026" లింక్‌పై క్లిక్ చేయండి. మీ లాగిన్ వివరాలై యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. వివరాలను సమర్పించిన తర్వాత మీ స్కోర్ కార్డ్ పీడీఎఫ్ రూపంలో స్క్రీన్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకొని, ఒక ప్రింటవుట్ తీసుకోవడం మరచిపోవద్దు.
ఇంటర్నెట్ లేకపోయిన ఫలితాలు తెలుసుకోవచ్చు
ఒక వేళ మీరు ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతంలో ఉన్నా లేదా వెబ్‌సైట్‌్ మొరాయించినా, సాధారణ మొబైల్ మెసేజ్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. మీ మొబైల్ మెసేజ్ బాక్స్‌లో ICSE మీ ఏడు అంకెల యూనిక్ ఐడీ టైప్ చేయండి. దీనిని 09248082883 నంబర్‌కు పంపండి. వెంటనే మీ ఫలితాలు మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Also Read: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
డిజిలాకర్‌లో ఫలితాలు
డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యూప్‌ను ఓపెన్ చేయండి. మీ అకౌంట్‌లోకి సైన్ ఇవ్వండి. ఖాతా లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలి. హోమ్‌పేజీలో ఐసీఎస్‌ఈ పదో తరగతి లేదా ఐఎస్సీ 12వ తరగతి మార్కు షీట్ లింక్ కోసం వెతకండి. అవసరమైన వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేస్తే మీ డిజిటల్ మార్కు షీట్ డౌన్‌లోడ్ అవుతుంది.
ఉమంగ్ యాప్‌లో ఫలితాలు
మీ మొబైల్‌లో ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి మీ రోల్ నెంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలను నమోదు చేయండి. మీ మార్కు షీట్ పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని సేవ్ చేసుకోండి.
