AP 10th Class Exam Results 2026 | అమరావతి: తెలంగాణలో నిన్న టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దాంతో తమ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు కాసేపట్లో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఇవాళ(ఏప్రిల్ 30న) విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సాంకేతిక పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసింది. 

Continues below advertisement

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6.30 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https://results.bse.ap.gov.in/ తో పాటు https://telugu.abplive.com//amp వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం వాట్సాప్‌లోనూ టెన్త్ ఫలితాలు అందిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ఫలితాల వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ ఇదే 

వాట్సాప్ మనమిత్రలోనూ ఏపీ టెన్త్ ఫలితాలు

Continues below advertisement

సర్వర్లు బిజీగా ఉంటాయి కనుక విద్యార్థులు త్వరగా ఫలితాలు చెక్ చేసుకునేందుకు మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఆ వాట్సాప్ నెంబర్‌కు Hi అని మెస్సేజ్ చేయాలి. తరువాత అక్కడ సూచనలు పాటిస్తూ వెళ్తూ మీ హాట్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. తరువాత స్క్రీన్ మీద టెన్త్ క్లాస్ విద్యార్థి ఫలితాలు కనిపిస్తాయి. ఆ రిజల్ట్ మీరు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం మంచిదని విద్యార్థులకు సూచిస్తున్నారు.