Telangana 10th Class results 2026 | తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అమ్మాయిలే పైచేయి సాధించారు. గత ఏడాదితో పోల్చితే రెండు శాతానికి ఈ ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలోని గ్రామీణ జిల్లాలు అద్భుత ప్రదర్శన కనబరచగా, పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా రాజధాని జిల్లా వెనుకబడి పోయింది. ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాతి స్థానాల్లో నాగర్ కర్నూల్ (99.03 శాతం), నిర్మల్ (98.96 శాతం), జగిత్యాల (98.87 శాతం) జిల్లాలు నిలిచి టాప్-4లో నిలిచాయి. అధికారిక వెబ్‌సైట్ https://results.bse.telangana.gov.in/ ,  https://results.bsetelangana.org/ లో విద్యార్థులు తమ రోల్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం విడుదల చేసిన అనుబంధ నివేదిక ప్రకారం.. మెజారిటీ జిల్లాలు 95 శాతానికి పైగా ఉత్తీర్ణతను సాధించాయి. మహబూబాబాద్ (98.81%), సంగారెడ్డి (98.69%), సూర్యాపేట (98.60%), కరీంనగర్ (98.57%), హన్మకొండ (98.56%), మరియు నల్గొండ (98.47%) జిల్లాలు టాప్-10 జాబితాలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లా 91.25% ఉత్తీర్ణత సాధించగా, వికారాబాద్ (90.58%), భద్రాద్రి కొత్తగూడెం (89.23%) జిల్లాలు జాబితాలో కింది వరుసలో ఉన్నాయి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు - మార్చి 2026 (జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు)

 జిల్లా పేరుహాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన వారుపాస్ శాతం
1ములుగు3287326499.30
2నాగర్ కర్నూల్106411053899.03
3నిర్మల్9743964298.96
4జగిత్యాల126871254498.87
5మహబూబాబాద్8152805598.81
6సంగారెడ్డి245732425298.69
7సూర్యాపేట123511217898.60
8కరీంనగర్131371294998.57
9హన్మకొండ120651189198.56
10నల్గొండ196671936698.47
11జయశంకర్ భూపాలపల్లి3541348398.36
12యాదాద్రి భువనగిరి8918876698.30
13సిద్దిపేట153251499597.85
14నారాయణపేట8306812597.82
15రాజన్న సిరిసిల్ల7310714597.74
16పెద్దపల్లి7488731697.70
17జనగామ6443629297.66
18కామారెడ్డి131191278797.47
19వనపర్తి7210702797.46
20మంచిర్యాల9684941397.20
21ఆదిలాబాద్108751053896.90
22మెదక్112321085396.63
23వరంగల్9485903495.25
24మేడ్చల్488554653195.24
25ఖమ్మం169581613195.12
26మహబూబ్ నగర్131991248294.57
27నిజామాబాద్243652296194.24
28కొమురం భీమ్ ఆసిఫాబాద్6932652794.16
29జోగులాంబ గద్వాల8037754993.93
30రంగారెడ్డి529464921792.96
31వికారాబాద్134821230291.25
32భద్రాద్రి కొత్తగూడెం127031150690.58
33హైదరాబాద్740996611589.23
 మొత్తం విద్యార్థులు51681549177495.15

వెనుకబడిన హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది. ఇక్కడ మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 89.23% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అన్ని జిల్లాల్లోనూ బాలుర కంటే బాలికలే అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం. మొత్తం మీద రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 95.15% గా నమోదైంది. ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైన చివరి 5 జిల్లాలు 

హైదరాబాద్ జిల్లా: 89.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది. ఇక్కడ మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 66,115 మంది పాస్ అయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 90.58% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 32వ స్థానంలో ఉంది. ఇక్కడ 12,703 మందికి గాను 11,506 మంది ఉత్తీర్ణత సాధించారు.

వికారాబాద్ జిల్లా: 91.25% ఉత్తీర్ణతతో ఈ జిల్లా 31వ స్థానంలో నిలిచింది. మొత్తం 13,482 మంది విద్యార్థుల్లో 12,302 మంది ఉత్తీర్ణులు కావడంలో విజయం సాధించారు.

రంగారెడ్డి జిల్లా: 92.96% ఉత్తీర్ణతతో 30వ స్థానంలో నిలిచింది. ఇక్కడ రాష్ట్రంలోనే రెండో అత్యధిక సంఖ్యలో (52,946 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

జోగులాంబ గద్వాల జిల్లా: 93.93% ఉత్తీర్ణతతో జాబితాలో కింద నుండి ఐదవ స్థానంలో అంటే 29వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 8,037 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 7,549 మంది పాస్ అయ్యారు.