విద్యార్థి దశ అంటేనే ఒత్తిడితో కూడుతున్న వయసు. ఈ ఏజ్‌లో విద్యార్థులు రెండు రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఒకటి శరీరంలో వస్తున్న మార్పులు కారణంగా వచ్చే ఒత్తిడి. రెండోది విద్యాపరమైన ఒత్తిడి. మొదటిది చాలా సర్వసాధారణమైన ప్రెజర్. దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. కానీ విద్యా పరమైన ఒత్తిడి చాలా ప్రమాదకరం. 


చదువుల్లో ఉండే ఒత్తిడి కారణంగానే ఏటా వందల మంది విద్యార్థులు సూసైడ్స్‌ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల పెట్టిన టార్గెట్ రీచ్ కాలేదనో.. కాలేమనో, అనుకున్న స్కోర్ రాలేదని ఇలా కారణమేదైనా విద్యార్థుల సూసైడ్స్‌ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి రిజల్ట్స్‌ వచ్చిన తర్వాత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏడాది పాటు చదువు చదువూ అంటూ ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులు ఫలితాల టైంలో కాస్త రిలాక్స్డ్‌గా ఉండాలి. 


అవాస్తవమైన అంచనాలకు దూరంగా ఉండాలి


మీ పిల్లల కెపాసిటీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి ఛేదించగలిగే లక్ష్యాలను మాత్రమే వారికి ఇవ్వాలి. విద్యార్థులందరూ టాపర్‌లు లేదా మొదటి ర్యాంకర్‌లు కాలేరు. భారీ అంచనాలు పెట్టుకొని అసంతృప్తి చెందడం కంటే వారి స్థాయికి తగ్గ గమ్యాన్ని ఎంచుకుంటే బెటర్. 


ఫలితాలపై సానుకూలంగా ఉండండి


చదువు ఒత్తిడిలో ఉన్న విద్యార్థి చిన్న సమస్యను కూడా బూతద్దంలో పెట్టి చూస్తారు. చిన్న లక్ష్యాన్ని చూసి కూడా భయపడిపోతారు. అలాంటి టైంలో తల్లిదండ్రులు వారిని పక్కనే ఉంటూ ప్రోత్సహించాలి. లక్ష్యాన్ని విద్యార్థి ప్రేమించేలా చేయాలి. పిల్లలను తన లక్ష్యాన్ని తేలికగా తీసుకునేలా "మీరు మీ వంతు ప్రయత్నం చేశారని... నేను నమ్ముతున్నాను, నేను ఉన్నాను" అనేలా ఎప్పుడూ మాట్లాడుతుండాలి. 


పోలిక వద్దే వద్దు 


విద్యార్థుల ఫలితాలను ఇతర విద్యార్థితో పోల్చినప్పుడే పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ పిల్లలు బాగా రాణిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి గత పనితీరుతో పోల్చడం ఉత్తమ మార్గం. కానీ పక్కవాళ్లతో అసలు పోల్చొద్దు. పరీక్ష ఫలితాల సమయంలో వేరే వాళ్ల చదువుల గురించి ఇంట్లో ప్రస్తావించకపోవడమే ఉత్తమమైన మార్గం. 


బేషరతుగా మద్దతు ఇవ్వండి


మీ పిల్లకు వచ్చి మార్కులు ఎలా ఉన్నా... సానుకూలంగానే స్పందించండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉండటం, ఫలితాలను సరైన రీతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. మీ బిడ్డ ఎలాంటి పని చేసినా... ఎలాంటి మార్కులు వచ్చినా, మీ వద్దకు వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ మీరు ఇవ్వాలి. తిడతారు, కొడతారనే భావన పిల్లల్లో కలగనీయొద్దు. ఇది వాళ్లు ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా, అనారోగ్యకరమైన ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. భవిష్యత్‌లో మరింత ఉత్సాహంగా పని చేయడానికి, మీ సహకారం తీసుకోవడానికి పిల్లలకు ఉపయోగపడుతుందీ భావన. మార్కులకు మించి మీ బిడ్డను చూసేలా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. 


విమర్శను దిద్దుబాటుతో సరి చేయండి


మిమ్మల్ని మీరు కఠినంగా అంచనా వేయడం వల్ల భవిష్యత్తులో మీరు మెరుగ్గా రాణించడానికి ఇబ్బంది పడతారు. మీరు పరిశీలకుడి స్థానం తీసుకోండి... మీ తప్పుల నుంచి నేర్చుకోండి.. మీకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. 


సన్నిహితులతో మాట్లాడండి


పిల్లల్ని సంతోషంగా చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే ఏది మంచిది అనుకుంటారో ఆ దిశగానే పిల్లలను నడిపిస్తారు. అలాగని చెప్పి అందులో ఫెయిల్ అయితే మిమ్మల్ని తిరస్కరించే మూర్ఖులైతే కారు. కాబట్టి ఒక పరీక్షలో ఏమి జరిగినా మిమ్మల్ని ప్రేమించుకుండా ఉండరు. కాబట్టి వారిని నిరాశపరచడం గురించి ఆలోచించకండి.  అలాంటి ఆలోచన ఉన్నప్పుడు నేరుగా మీ పేరెంట్స్‌తో మాట్లాడటం... లేదా సన్నిహితులతో పంచుకోవడం చేయాలి. పరీక్షలే ప్రపంచం కాదని గుర్తు పెట్టుకోండి. 


ప్రతికూల ఫలితంతో ఎన్నో లాభాలు


చెడు లేదా ఊహించని ఫలితాలు మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాయి. మీరు నేర్చునే అంశంపై మరింత లోతైన అధ్యయనం చేసే అవకాశాన్ని ఇస్తాయి. మీ అధ్యయన సరళిని మార్చుకోవడానికి ఇదే ఛాన్స్ అన్నమాట. బలహీనంగా ఉన్న వాటిపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా తమ జీవితంలో ఏదో ఒక విషయంలో విఫలమయ్యారు. అందుకే నెగెటివ్‌ ఫలితాలు వచ్చినప్పుడు  మిమ్మల్ని మీ స్నేహితులతో లేదా ఇతరులతో అసలు పోల్చుకోకండి.


మీ సీరియస్‌నెస్‌ను తల్లిదండ్రులకు చెప్పండి


కొన్నిసార్లు, మీరు ఆటలు, స్నేహితులంటూ తిరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంటుంది. చదువుపై తగినంత శ్రద్ద పెట్టడం లేదన్న కంగారు కనిపిస్తుంది. అలాంటి టైంలో పేరెంట్స్‌తో మాట్లాడి మీ స్టడీస్‌ పట్ల సీరియస్‌గా ఉన్నట్టు చెప్పండి. అంతే కానీ వాళ్లను లైట్‌ తీసుకొని వారిలో ఒత్తిడి పెంచొద్దు