శని గ్రహం.. సౌరకుటుంబంలోనే అత్యంత ఆకర్షణీయమైన గ్రహం. చుట్టూ వలయాలతో అద్భుతంగా కనిపిస్తుంది. భూమికి కూడా ఈ వలయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది ఇప్పుడు కాదట. 46 కోట్ల సంవత్సరాల క్రితం భూమి కూడా శాటర్న్ ప్లానెట్ మాదిరే చుట్టూ రింగ్‌లతో ఉండేదని ఓ సైన్స్ పరిశోధన వెల్లడించింది. ఈ మేరకు గత వారం ఎర్త్‌ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్‌లో కథనం ప్రచురించింది. 


Earth News: దాదాపు 4వందల 66 మిలియన్ సంవత్సరాల క్రితం స్పేస్‌ నుంచి భారీ శిలలు వచ్చి భూమిని ఢీకొట్టాయని.. ఫలితంగా కొన్ని మిలియన్ సంవత్సరాల వ్యవధిలోనే భూమిపై క్రేటర్స్‌ ఏర్పడ్డాయని పరిశోధన పత్రం తెలిపింది. ఆ కాలానికే చేందిన లైమ్‌స్టోన్ సహా అత్యధిక మొత్తంలో పేరుకు పోయిన వ్యర్థాల గుట్టలను చైనా, యూరఫ్‌, రష్యా వ్యాప్తంగా గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అదే సమయంలో చాలా ఎత్తున సునామీలు కూడా ఏర్పడ్డాయని.. ఇవన్ని కలిపి చూసినప్పుడు ఒక దానితో ఒకటి సంబంధం ఉందని అర్థమవుతోందని పరిశోధన పేర్కొంది.


అంతేకాకుండా ఈ సమయంలోనే భూమి మీద 21 కెటరాక్ట్స్ ఏర్పడ్డాయని.. వీటిని భూ టెక్టానిక్ ప్లేట్లతో కలిపి చూసినప్పుడు ఆ భారీ గుంతలు ఎక్కడ ఏర్పడ్డాయో తేలిందన్నారు. ఇవన్నీ కూడా వేర్వేరు కాంటినెంట్లలో భూమధ్యరేఖకు సమీపంలో ఏర్పడినట్లు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే సమయంలో ధ్రువాల దగ్గర ఈ విధమైన పరిస్థితే లేదని చెప్పారు.


భూమిపై 20లక్షల ఏళ్లపాటు కొనసాగిన మంచు యుగం.. కారణం ఈ వలయాలే..!:






ఇదే సమయంలో నాడు భూమధ్యరేఖకు సమీపంలో ఈ గుంతలు ఏర్పడడానికి ఎంత భూమి అనువుగా ఉందన్న విషయంపై కూడా లెక్కలు వేసినట్లు తెలిపిన శాస్త్రవేత్తలు.. 30 శాతం భూమి ఈక్వేటర్‌కు దగ్గరగా ఉందని.. 70 శాతం వరకు హైయర్ లాటిట్యూడ్ కూడా ఉండేదని చెప్పారు. అయితే భూమిని స్పేస్ రాక్స్‌ ఢీకొట్టినప్పుడు అవి ఎక్కడైనా భూమి మీద ఢీకొనకుండా  భూమధ్య రేఖకు సమీపంలోనే ఢీకొట్టడానికి ఈ వలయాలే అడ్డుగా నిలిచాయని చెబుతున్నారు. అదే జరగకుంటే చందమామ, మార్స్ గ్రహాల మీద మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ లోయలు ఏర్పడి ఉండాల్సిందని అంటున్నారు.


ఐతే భూమి మీద ఉన్న ఈ 21 గొయ్యిలు మాత్రం ఒకే పోలికతో ఒకే లైన్‌లో ఉండడం సాదారణ పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. స్పేస్‌ రాక్స్ భూమిని ఢీకొట్టడానికి ముందే ఒక పెద్ద ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొని భూమిపై సునామీలు ఏర్పడడం సహా భారీ ఎత్తున దుమ్ము ధూళి మేఘాలు పేరుకుపోయి కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగి ఉండొచ్చని శాస్త్రలవేత్తలు అంచనా వేశారు. ఇదే సమయంలో రింగ్‌ల  కలిగి ఉండే విషయంలో శాటర్న్ మాత్రమే కాకుండా జూపిటర్‌, నెప్ట్యూన్‌, యురేనస్‌ కూడా కొద్ది స్థాయిలో చుట్టూ రింగ్‌లు కలిగి ఉన్నాయని.. మార్స్ కు చెందిన రెండు మూన్‌లు ఫోబోస్‌, డీమోస్‌ కూడా ఈ వలయాల నుంచి ఏర్పడ్డవేనని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు.


Also Read: వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?


ఈ తరహాలోనే భూమికి దగ్గరగా వచ్చిన ఏదైనా గ్రహశకలాలు గ్రావిటీకి ఛిద్రమై ధూళిగా మారి భూమధ్య రేఖకు సమీపంగా వలయాల రూపంలో పరిభ్రమిస్తూ ఉండేవని నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత చాలా కాలానికి వాటిలోని దుమ్ము ధూళి క్రమంగా భూమిమీద ఈక్వేటర్‌కు దగ్గర్లో పడిందని పరిశోధన పత్రంలో వివరించారు. ఆ విధంగానే భూమి చుట్టూ ఉన్న వలయాలు అంతరించి పోయాయని తేలింది. అయితే ఆ సమయంలోనే వలయాల కారణంగా భూమి మీదకు పడే సూర్యకాంతి తగ్గి భూమి మీద ఉష్ణోగ్రతలు పడిపోయాయని వివరించారు. దీనికి ఆధారంగా 465 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఈ పరిస్థితి ఉండేదన్న విషయాన్ని ఇప్పటికే పరిశోధనల్లో గుర్తించిన విషయాన్ని ఈ పరిశోధన పత్రంలో ప్రస్తావించారు. దాదాపు 20 మిలియన్ సంవత్సరాల పాటు భూమి మీద హిర్నాటియన్ ఐస్ ఏజ్ కొనసాగిందని తెలిపారు.  ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు ఆ వలయాల్లోని ధూళి క్రమంగా భూమి మీదకు పడి ఇప్పుడు రష్యా, యూరఫ్‌, చైనాలో ఉన్న లైమ్‌స్టోన్ ముద్దలుగా మారిందని వెల్లడించారు.


Also Read: డెబ్భై ఏళ్ల చరిత్రలోనే భారీ తుపాను.. చైనాను వణికిస్తున్న బెబింకా టైఫూన్‌