వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

1939లో ఐన్‌స్టీన్ రాసిన లెటర్‌ని వేలం వేస్తే 32 కోట్ల రూపాయల ధర పలికింది. క్రిస్టీస్ సంస్థ ఈ వేలం వేయగా ఇంత భారీ ధరకు అమ్ముడుపోయింది. మరి...అంత గొప్ప ఆ లేఖలో ఏముంది..? ఎందుకంత కాస్ట్ పెట్టి మరీ కొన్నారు..? ఆ లెటర్‌లో ఉన్న కంటెంట్ అలాంటిది మరి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌కి ఈ లేఖ రాశారు ఐన్‌స్టీన్. అణ్వాయుధాలు ఎంత విధ్వంసం సృష్టిస్తాయో వివరిస్తూ ఈ లెటర్ పంపారు. వెంటనే అమెరికా జోక్యం చేసుకోవాలని సూచించారు. న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్‌ లైబ్రరీలో ఈ లేఖ దొరికింది. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో ముందే ఊహించి రాసిన ఐన్‌స్టీన్..యురేనియం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. యురేనియం పవర్‌ఫుల్ బాంబులను తయారు చేయొచ్చని, ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. అంతే కాదు. జర్మనీ ఈ అణ్వాయుధాలను తయారు చేసే పనిలో ఉందని, అమెరికా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ లెటర్ అందిన వెంటనే అమెరికా అలెర్ట్ అయింది. న్యూక్లియర్‌ ఫిజన్‌పై రీసెర్చ్ కూడా చేసింది. అదే Manhattan Project కి దారి తీసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపించిన లేఖల్లో ఇదీ ఒకటి అని ఇప్పటికీ చెప్పుకుంటారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola