GATE Application Edit: గేట్ - 2024 దరఖాస్తుల సవరణ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?

GATE Application Edit: గేట్-2024 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సంబంధించిన విండోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నవంబరు 18న ప్రారంభించింది.

Continues below advertisement

GATE Application Correction: గేట్-2024 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సంబంధించిన విండోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (IISC, Bengalore) నవంబరు 18న ప్రారంభించింది. గేట్-2024 రిజిస్ట్రేషన్‌ (GATE 2024 Registration) చేసుకున్న అభ్యర్థులు వివరాల్లో మార్పుకునేందుకు (Application Edit) నవంబరు 24 వరకు అవకాశం కల్పించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింకును ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ/ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి వివరాలు సవరించుకోవచ్చు. 

Continues below advertisement

అప్లికేషన్ కరెక్షన్ ఇలా..

➥ దరఖాస్తు వివరాలు మార్చుకునేందుకు అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- gate2024.iisc.ac.in.

➥ అక్కడ "GOAPS portal" లింకులో లాగిన్ వివరాలను (ఎన్‌రోల్‌మెంట్ ఐడీ/ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్) నమోదుచేయాలి.

➥ తర్వాత "Edit GATE Application Form" ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

➥ దరఖాస్తు వివరాలు ఎక్కడ తప్పులు ఉన్నాయో గుర్తించి, సరిచేసుకోవాలి. పేరు, పుట్టినతేదీ వివరాలు, జెండర్, కేటగిరీ, చిరునామా, పరీక్ష కేంద్రం తదితర వివరాలు సరిచూసుకొని, తేడాలుంటే మార్చుకోవచ్చు.

➥ మార్చిన వివరాలను మరోసారి సరిచూసుకోవాలి. 

➥ వివరాలు సరిచూసుకుని "Save and View Application" బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ తర్వాత "Submit" బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ ఆ తర్వాత నిర్ణీత ఫీజు చెల్లింపునకు సంబంధించిన గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించాలి.

➥ ఫీజు చెల్లించగానే, భవిష్యత్ అవసరాల కోసం కరెక్షన్ చేసిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Website

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

పరీక్ష విధానం..

✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.

✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.

✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement