Fact Check Tenth Results : ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. అతి తక్కువ పాస్ పర్సంటేజీ ఉండటమే కాదు.. పది మార్కులు వచ్చిన వారిని కూడా పాస్ చేశారంటూ కొన్ని మార్కుల జాబితాలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. అలాంటి  వాటిలో  రెండింటిని కింద ఇస్తున్నాం చూడండి. 


ఏపీ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం



10 తరగతి పరీక్షల్లో 11 మార్కులు 17 మార్కులు 23 మార్కులు వచ్చిన విద్యార్థి పాస్ అయ్యారు. ఇది నిజమే. ఆ విద్యార్థి నిజంగానే పాస్ అయ్యారు. ఇయితే ఇక్కడ కేటగిరి చూడాల్సి ఉంది. ఇలా మార్కులు తక్కువ ఉన్నా పాసయిన మార్కుల జాబితాలో  ప్రతీ చోటా ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్‌ కేటగిరి విద్యార్థులు ఉంటున్నారు. కానీ ఆ విషయం మాత్రం ఎవరూ చెప్పడం లేదు.


 





ఇలా చేస్తే పదోతరగతిలో మీకు వచ్చిన మార్కులు పెరగొచ్చు! 


ఒక ప్రత్యేక కేటగిరి కి చెందిన పిల్లలకు పాస్ మార్కుల 10 మాత్రమే... లెర్నింగ్ డిజిబిలిటి, ఆటస్టిక్ స్పెక్ట్రమ్ లక్షణాలు ఉన్న పిల్లలు ఈ కేటగిరిలోకి వస్తారు...ఇలాంటి విద్యార్థుల వివరాలు బయట పెట్టకూడదు.   ఇలాంటి పిల్లల్లో ఎక్కువ మందిలో వయసుతో పాటు లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇలా ప్రత్యేకమైన మినహాయింపు పొందుతున్న కేటగిరిలను ఈ 
 ఈ లింక్ లో చూడవచ్చు.   http://www.bseaps.org/pdf/4.%20G%20O%20MS%2014%20CwSN.pdf




జూలైలో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, తేదీలు ప్రకటించిన మంత్రి బొత్స
ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఉద్దేశంతో.. పరీక్షలు సరిగ్గా జరగలేదని ప్రచారం చేయాలన్న లక్ష్యంతో కొంత మంది ఇలాంటి ప్రచారాలను ఉద్ధృతంగా చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. వారంతా పీహెచ్ క్యాటగిరీలోకి రావడం వల్లనే తక్కువ మార్కులు వచ్చినా పారంతా పాస్ అయినట్లేనని అంటున్నారు.  ఈ విషయం ఏమైనా సందేహాలుంటే సంప్రదించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.