SSC Exams Reverification : ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. పదో తరగతి ఫలితాల్లో 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఫలితాల్లో బాలికలదే పైచేయి. అయితే 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ అవ్వలేదు. అయితే విద్యార్థులకు ఎస్ఎస్బీ బోర్డు మరో అవకాశం కల్పించింది.  రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పై పలు సూచనలు చేసింది. 


ఎస్ఎస్సీ రీకౌంటింగ్ , రీవెరిఫికేషన్‌పై సూచనలు :



  • రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకు కోసం రూ.500, సీఎఫ్ఎమ్ఎస్ సిటిజన్ చలాన్ (www.cfms.ap.gov.in) ద్వారా జూన్ 20వ తేదీ లోపు చెల్లించారు. 

  • రీవెరిఫికేషన్, ఆన్సర్ స్క్రిప్ట్‌ల ఫోటోకాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జూన్ 20వ తేదీలోపు సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 సిటిజన్ చలాన్‌ను చెల్లించాలి.  

  •  ఒక సబ్జెక్ట్ రీవెరిఫికేషన్, ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు ఆ సబ్జెక్ట్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు.  

  •  నగదు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఇతర విధానాల్లో చెల్లింపులు ఆమోదించరు.  సీఎఫ్ఎమ్ఎస్ సిటిజన్ చలాన్‌లు మాత్రమే ఆమోదిస్తారు. ప్రతి అభ్యర్థి ప్రత్యేక చలాన్ తీసుకోవాలి.

  •   CFMS చలాన్ ద్వారా అవసరమైన రుసుం చెల్లించిన అభ్యర్థులు ఈ దిగువ పత్రాలు సమర్పించాలి

  •  www.bse.ap.gov.in  దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంది. DEO ఆఫీసులోని కౌంటర్లలో కూడా ఫారమ్ అందుబాటులో ఉంది.  

  • సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా కౌంటర్ సంతకం చేసిన హాల్ టిక్కెట్ ఫొటోకాపీ  

  • అభ్యర్థి పేరుతో పొందిన అవసరమైన మొత్తానికి CFMS సిటిజన్ చలాన్  

  •  పైన పేర్కొన్న పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్‌ DEO ఆఫీసులలోని కౌంటర్లలో అందజేయాలి. DGE, A.P (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించరు. 

  • మార్కుల మొత్తం మారిన సందర్భాల్లో సవరించిన మెమోరాండం జారీ చేస్తారు.  


రీవెరిఫికేషన్ 


 i. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కించడం 


 ii. రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు ఇచ్చారా లేదా అని ధృవీకరించడం. 


 iii. ముందుగా మార్కులు ఇవ్వని రాతపూర్వక సమాధానాలు మూల్యాంకనం. 


 iv. రీవాల్యూషన్, నిర్దిష్ట సమాధానాల మళ్లీ కరెక్షన్ కు సంబంధించిన అప్పీల్‌లు పరిగణించబడవు  


పాఠశాలల హెడ్ మాస్టర్ లాగిన్‌లో ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత సబ్జెక్ట్ వారీగా మార్కుల మెమోరాండం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచుతారు.  హెడ్ మాస్టర్ సంబంధిత స్కూల్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, వ్యక్తిగత మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.in నుంచి నేరుగా మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


మైగ్రేషన్ సర్టిఫికేట్ 


పరీక్ష దరఖాస్తు, ఫీజులను సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.govలో డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను పొందేందుకు హెడ్ మాస్టర్ ను సంప్రదించవచ్చు. హెడ్ మాస్టర్ డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను కలర్ PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సబ్జెక్ట్ వారీగా మార్క్స్ మెమోరాండమ్‌తో పాటు దానిని తప్పకుండా అందజేస్తారు.  సబ్జెక్ట్ వారీగా మార్కులతో ఒరిజినల్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో అన్ని పాఠశాలలకు అందజేస్తారు. హెచ్ఎమ్ సర్టిఫికేట్‌పై సంతకాన్ని వెరిఫై చేసి విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికేట్‌ను అందజేస్తారు.