SSC Exams Reverification : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కాగా, 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. 4,14,281 మంది ఉత్తీర్ణులుకాగా, ఫలితాల్లో బాలికలదే పైచేయి. ప్రకాశం జిల్లాల్లో అధిక శాతం ఉత్తీర్ణులు కాగా, అనంతపురం చివరి స్థానంలో నిలిచింది. అయితే 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫెయిన్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీకి ముందు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పై వెళ్లే అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండేళ్లు టెన్త్ బోర్డ్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణత శాతం చాలా తగ్గింది. కరోనా కారణంగా ఇలా జరిగిందని, అందుకే విద్యార్థులు నష్టపోయారని మంత్రి బొత్స చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర విద్యాశాఖ తీసుకుంది. వచ్చే నెలలో రాయనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చినా వారిని కంపార్టుమెంటల్ పాస్ కింద చూడరు. సప్లిలో విద్యార్థులకు వచ్చే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే వారికి కూడా డివిజన్‌లను కేటాయించనున్నారు. ఫెయిలైన విద్యార్థుల వివరాలను నేడు (జూన్ 7న) అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
Also Read: SSC Exams Reverification : ఇలా చేస్తే పదోతరగతిలో మీకు వచ్చిన మార్కులు పెరగొచ్చు!
రెండు రోజుల్లో షార్ట్ మెమోలు..
టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులు తమ మార్కులకు సంబంధించి షార్ట్ మెమోలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో రెండు రోజుల తరువాత పొందవచ్చునని మంత్రి బొత్స తెలిపారు. విద్యార్థులు ఈ మెమోల ద్వారా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందవచ్చు. విద్యార్థులు జూన్ 20వ తేదీ లోపు రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున.. రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తాజా ఫలితాలలో 64.02 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్