కేంద్ర బడ్జెట్ 2023-24 ఆర్థిక మంత్రి సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్దపీఠ వేశారు. ఇందులో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 100 కొత్త ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. స్మార్ట్ క్లాస్‌రూమ్, ప్రెసిషన్ ఫార్మింగ్, ఇంటెలిజెంట్ మరియు ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. అదే విధంగా రాబోయే మూడేళ్లలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనిద్వారా లక్షలాది మంది యువత నైపుణ్యం సాధించేందుకు  దోహదపడుతుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను కూడా ప్రారంభించనున్నారు. మొత్తంమీద కొత్త బడ్జెట్‌లో యువతకు పెద్దపీట వేశారు.


47 లక్షల మంది యువతకు స్టైఫండ్‌...
47 లక్షల మంది యువతకు స్టైఫండ్ ఇస్తామని, ఇందుకోసం నేషనల్ అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. ఇదొక్కటే కాదు, 5G ​​సేవతో పనిచేసే అప్లికేషన్‌లను తయారు చేయడానికి ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. 


ఫార్మా రంగంలో పరిశోధనలకు ఊతం..
ఫార్మా రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు పారిశ్రామిక పెట్టుబడులు కూడా ఇందులో ఉంటాయని అంచనా. దీనితో పాటు ఉపాధ్యాయుల శిక్షణను మెరుగుపరిచేందుకు కూడా కృషి చేస్తామన్నారు. ఇదొక్కటే కాదు, విద్యనష్టాన్ని భర్తీ చేయడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ దిశగా పనిచేస్తున్న ఎన్జీవోలను బడ్జెట్‌తో అనుసంధానం చేయనున్నారు. అనేక అధునాతన ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రాలు కూడా వచ్చే ఏడాదికి తెరవనున్నారు.


38,800 టీచర్ పోస్టుల భర్తీ..
గిరిజన విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. డిజిటల్‌ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న 740 ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్లలో సుమారు 3.5 ల‌క్షల మంది గిరిజ‌న విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.


డిజటల్ లైబ్రరీలు..
పిల్లలు, యువత కోసం ప్రత్యేకంగా 'నేషనల్ డిజిటల్ లైబ్రరీలు(NDL)' ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. పంచాయతీ, వార్డు స్థాయిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుస్తకాలు స్థానిక, ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంటాయని, అలాగే వయస్సును బట్టి పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. నాణ్యమైన పుస్తకాల ల‌భ్యత కోసమే జాతీయ డిజిట‌ల్ లైబ్రరీని ఏర్పాటు చేయ‌నున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ తెలిపారు. 


2023-24 విద్యారంగానికి కేటాయింపులు ఇలా..


ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం, విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఫిబ్రవరి 1న లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ 2023ను ప్రవేశ‌పెట్టారు. అయిదోసారి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వ‌రుస‌గా అయిదోసారి ఆమె బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టారు. అంతముందు బ‌డ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశ‌పెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మ‌న్మోహ‌న్ సింగ్‌, అరుణ్ జైట్లీ, పి. చిదంబ‌రం ఉన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినట్లు ఆమె పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత, భారీగా విద్యా సంస్థల ఏర్పాటు! బడ్జెట్ కేటాయింపు ఇలా!
2023-24 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 157 మెడికల్ కాలేజీలు ఉండగా.. వీటిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మిషన్‌ను ప్రారంభిస్తున్నారు.
బడ్జెట్ కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..


బడ్టెట్ 2023 కోసం క్లిక్ చేయండి..