CBSE Re-verification, Re-evaluation: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మే 13న విడుదలచేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ ప‌దోత‌ర‌గ‌తిలో 93.6 % శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 87.98 % మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలపై ఏమైనా సందేహాలుంటే రీవెరిపికేషన్, రీవాల్యూయేషన్, సమాధానపత్రాల స్కాన్ కాపీలను పొందేందుకు అవకాశం కల్పించింది. అందుకు సంబంధించిన షెడ్యూలును సీబీఎస్‌ఈ విడుదల చేసింది.


12 తరగతి రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ షెడ్యూలు ఇదే..
➥ పదోతరగతి ఫలితాలకు సంబంధించి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 17 నుంచి 21న రాత్రి 12 గంటలలోపు ఒక్కో సబ్జెక్టుకు నిర్ణీత ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.


➥ ఇక సమాధాన పత్రాలు ఫొటోకాపీలు కావాల్సిన విద్యార్థులు జూన్ 1 నుంచి జూన్ 2న రాత్రి 12 గంటలలోపు ఒక్కో ఆన్సర్ బుక్‌కు నిర్ణీత ఫీజు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది.


➥ సమాధాన పత్రాలు రీవాల్యూయేషన్ కోసం ఇక సమాధాన పత్రాలు ఫొటోకాపీలు కావాల్సిన విద్యార్థులు జూన్ 6 నుంచి జూన్ 7న రాత్రి 12 గంటలలోపు రీవాల్యూయేషన్ కోరే ఒక్కో ప్రశ్నకు నిర్ణీత ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.



10 తరగతి రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ షెడ్యూలు ఇదే..
➥ పదోతరగతి ఫలితాలకు సంబంధించి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 20 నుంచి 24న రాత్రి 12 గంటలలోపు ఒక్కో సబ్జెక్టుకు నిర్ణీత ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.


➥ ఇక సమాధాన పత్రాలు ఫొటోకాపీలు కావాల్సిన విద్యార్థులు జూన్ 4 నుంచి జూన్ 5న రాత్రి 12 గంటలలోపు ఒక్కో ఆన్సర్ బుక్‌కు నిర్ణీత ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.


➥ సమాధాన పత్రాలు రీవాల్యూయేషన్ కోసం ఇక సమాధాన పత్రాలు ఫొటోకాపీలు కావాల్సిన విద్యార్థులు జూన్ 9 నుంచి జూన్ 10న రాత్రి 12 గంటలలోపు రీవాల్యూయేషన్ కోరే ఒక్కో ప్రశ్నకు నిర్ణీత ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.



సీబీఎస్ఈ ప‌దోత‌ర‌గ‌తిలో 93.6 % శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే 2.04 % మంది బాలికలు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షల్లో బాలికలు 94.75 % మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో సుమారు 47 వేల మంది విద్యార్థులు.. 95 శాతం క‌న్నా ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. ఇక దాదాపు 2.12 ల‌క్షల మంది విద్యార్థులు 90 % క‌ంటే ఎక్కువ మార్కుల‌తో పాస‌య్యారు. కంపార్ట్‌మెంట్‌ పరీక్షలకు 1.32 ల‌క్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 23 ల‌క్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు రాశారు. 


10వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. ఫలితాల్లో మొత్తంగా 87.98 % మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాది 87.33 % మంది పాస‌య్యారు. ఫలితాల్లో మొత్తం 91.52 % మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 6.40 % అద‌నంగా ఉత్తీర్ణత సాధించారు. సుమారు 24 వేల మంది విద్యార్థులు ప‌రీక్షల్లో 95 శాతం క‌ంటే అధిక మార్కుల‌ను సాధించారు. ఇక 1.16 లక్ష మంది విద్యార్థులు 90 శాతం మార్కుల‌ు సాధించారు. ఇక కంపార్ట్‌మెంట్ పరీక్షలకు 1.22 ల‌క్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది దాదాపు 17 ల‌క్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు రాశారు. 


12వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..