Single Girl Child Scholarship 2024: సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థినులు లబ్ది పొందుతారు. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ప్రతి సంవత్సరం అందిస్తోంది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


✦ సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2024


అర్హతలు..


* విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి.


* పదోతరగతి పరీక్షలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. పదోతరగతిలో ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.2500 కంటే మించకూడదు. 11 & 12 తరగతుల విద్యార్థినులకు ట్యూషన్ ఫీజు నెలకు రూ.3000 కంటే ఎక్కువ ఉండకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.


స్కాలర్‌షిప్‌: ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున అందిస్తారు. విదేశాలలో చదువుతున్న ఎన్ఆర్ఐ (NRI) విద్యార్థులకు ట్యూషన్ ఫీజును గరిష్టంగా నెలకు రూ.6,000 వరకు నిర్ణయించారు. ఈ స్కాలర్‌షిప్ పొందడానికి భారతీయ పౌరులకు మాత్రమే అవకాశం ఉంటుంది.


ద‌రఖాస్తు చేయడం ఇలా..


➥ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/cbsenew/cbse.html సందర్శించి, CBSE స్కాలర్‌షిప్ పోర్టల్‌కి వెళ్ళాలి.


➥ మీరు కొత్త లాగిన్ అవుతున్నట్లైతే, 'రిజిస్టర్' బటన్ పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను ఇవ్వాలి, మీ లాగిన్ ఐడీని సృష్టించాలి. మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకొని ఉంటే, లాగిన్‌పై క్లిక్ చేసి, మీ నమోదిత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ లేదా గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.


➥ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ విభాగాన్ని క్లిక్ చేయండి, అక్కడ మీకు "సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ - 2025 క‌నిపిస్తుంది. (తాజా దరఖాస్తు)" ఎంపికను ఎంచుకోండి.


➥ అక్కడ అడిగిన ప్రతీ వివ‌రాల‌ను న‌మోదు చేయండి. మొద‌ట‌, 10వ‌ తరగతి వివరాలను నమోదు చేయండి.


➥ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, దరఖాస్తును సమీక్షించి సమర్పించండి.


➥ 'మార్గదర్శకాలు' విభాగంలో అందించిన హామీ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఫోటోను జత చేయండి. అంతేకాకుండా, స్కూల్ ప్రిన్సిపాల్ ద్వారా అంగీకారం పొందండి.


➥ 'మార్గదర్శకాల్లో' పేర్కొన్న ఫార్మాట్ ప్రకారం అఫిడవిట్‌ను సిద్ధం చేయండి.


➥ అప్లికేష‌న్‌లో అడిగిన‌ అన్ని అవసరమైన డాక్యుమెంట్లను ఒకే PDF ఫైల్‌లో (1 MB లోగా ఉండేలా) అప్‌లోడ్ చేయండి.


➥ అభ్యర్థులు తమ దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీ సూచన కోసం నిర్ధారణ పేజీని రూపొందించి ప్రింట్ చేయడానికి 'నిర్ధారణ పేజీ' ఎంపికపై క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.02.2025.


➥ సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 15.02.2025.


Notification


Online Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..