CBSE CTET December 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2024లో నిర్వహించిన సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ డిసెంబర్‌ సెషన్‌ 2024 (CTET) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు సీటెట్ అధికారిక వెబ్ సైట్ వెబ్‌సైట్ , ctet.nic.in లో ఈ రిజల్ట్ ను చెక్ చేస్కోవచ్చు. అందుకు అభ్యర్థులు తమ రోల్ నంబర్ ను లాగిన్ క్రెడెన్షియల్ గా ఉపయోగించాల్సి ఉంటుంది. దాంతో పాటు స్కోర్ కార్డులను సైతం విద్యార్థులు డైన్ లోడ్ చేయవచ్చు.


సీటెట్ డిసెంబర్ 2024 రిజల్ట్ ఎలా చెక్ చేయాలంటే..


అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవడం ద్వారా ఫలితాలను చెక్ చేయొచ్చు.


1: ఫలితాన్ని చెక్ చేయడానికి, అభ్యర్థులు ముందుగా CTET అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ని  సందర్శించండి.


2: ఆ తర్వాత, అభ్యర్థి హోమ్‌పేజీలో “CTET Result 2024” లింక్‌పై క్లిక్ చేయండి.


3: అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను (రోల్ నంబర్, పుట్టిన తేదీ)తో సబ్మిట్ చేయండి.


4: ఇప్పుడు అభ్యర్థి రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


5: ఆపై రిజల్ట్ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయండి.


6: ఫైనల్ గా, అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.


సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష


సీటెట్ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా డిసెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాయంత్రం షిఫ్టులో మరో పేపర్‌ నిర్వహించారు. పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీ డిసెంబర్ 31, 2024న విడుదల కాగా.. ఏవైనా అభ్యంతరాలను తెలియజేయడానికి చివరి తేదీగా జనవరి 5, 2025ని నిర్ణయించారు. తాజాగా రిజల్ట్ విడుదల చేశారు. 


పరీక్షలో విజయం సాధించాలంటే..


జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో విజయం సాధించాలంటే కనీసం 60% మార్కులు సాధించాలి. అంటే అభ్యర్థులు 150కి కనీసం 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST, OBC, PWDతో సహా ఇతర రిజర్వ్‌డ్ వర్గాలకు ఇది 55% గా నిర్ణయించారు. ఈ లెక్కన అభ్యర్థులు 150కి కనీసం 82 మార్కులు సాధించాల్సి ఉంటుంది.


సీటెట్ పరీక్ష


సాధారణంగా సీటెట్ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో పాల్గొనే ఈ పరీక్షకు చాలా డిమాండ్ ఉంది. ఎప్పటిలాగే ఈ సారీ ఈ ఎగ్జామ్ కు లక్షల మంది హాజరయ్యారు. ఇకపోతే ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ను కూడా అందించారు. 


డైరెక్ట్‌ లింక్‌


https://cbseresults.nic.in/CtetDec24/CtetDec24q.htm


గేట్‌ 2025 అడ్మిట్‌కార్డ్‌ విడుదల


ఐఐటీ (Indian Institute of Technology IIT) సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్‌ (GATE 2025) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. గేట్ 2025 పరీక్ష షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. తాజాగా అడ్మిట్‌ కార్డు విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 అడ్మిట్‌ కార్డులు ఇటీవల ఐఐటీ రూర్కీ (IIT Roorkee) విడుదల చేసింది.


Also Read : JEE Main 2025 : పేపర్ల వారిగా జేఈఈ మెయిన్ 2025 షెడ్యూల్ రిలీజ్ - ఎగ్జామ్స్ డేట్స్ రివీల్ చేసిన ఎన్టీఏ