JEE Main 2025 : ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (Joint Entrance Examination JEE Main)- 2025 సెషన్‌ 1 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్ష జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష జనవరి 30, 2025న నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలతో పాటు భారత్‌ బయట 15 నగరాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.


జేఈఈ మెయిన్ 2025


జేఈఈ మెయిన్ పేపర్‌ 1 (బీఈ/ బీటెక్‌) పరీక్ష జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్ష నిర్వహిస్తారు. 


ఇక పేపర్ 2లో రెండు భాగాలు ఉంటాయి. పేపర్ 2ఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (BArch) కోసం, పేపర్ 2బి బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (BPlanning) కోర్సు కోసం. బీటెక్ (BTech), బీఈ (BE), బీ ఆర్క్ (BArch), బీ ప్లానింగ్ (BPlanning) వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIITs), లాంటి అనేక ఇతర సంస్థలు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాయి. ఈ పరీక్ష పరీక్ష జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరగనుంది. ప్రతి సంవత్సరం రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2025 రెండవ సెషన్ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ఇక పరీక్షలకు మూడ్రోజుల ముందు అధికారిక పోర్టల్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 


JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్, ఎగ్జామ్ సిటీ స్లిప్ విడుదలైనప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..



  •  ముందుగా జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inకి వెళ్లండి.

  •  హోమ్ పేజీలో కనిపించే సెషన్ 1 అడ్మిట్ కార్డ్/ఎగ్జామ్ సిటీ స్లిప్ డౌన్‌లోడ్ లింక్‌ను క్లిక్ చేయండి.

  •  మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలను సబ్మిట్ చేయండి.

  •  అడ్మిట్ కార్డ్/ఎగ్జామ్ సిటీ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.


జేఈఈ మెయిన్ 2025 గురించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


జేఈఈ మెయిన్‌ పరీక్ష ఎందుకంటే?



  • ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది.

  • ఈ జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా.. ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్‌ సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.

  • బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2, బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. బీఆర్క్‌కు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి. దాన్ని సాధారణంగా తొలి రోజు నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచి పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు.


Also Read : JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2025 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?