సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 1న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఇప్పటివరకు కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును 'సప్లిమెంటరీ'గా మార్చారు.
ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు కూడా బోర్డు అవకాశం కల్పించింది. పదోతరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 17న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 12వ తరగతి సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
Also Read:
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు క్యాట్ లేదా మ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్/ మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 19 వరకు అవకాశం ఉంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో జులై 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో ప్రవేశాలు!
తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్స్ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..