కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను జల శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని, జలాల వాటాల అంశాన్ని ఆ శాఖకు నివేదించాలని లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. బోర్డు భేటీలోని నిర్ణయానికి అనుగుణంగా నివేదించాలని సూచించింది. 20 రోజులైనా కేంద్రానికి పంపినట్లుగా తమకు సమాచారం లేదని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు చెరి సగం ప్రాతిపదికనే ఇండెంట్ ఇస్తామన్న ప్రభుత్వం లేఖలో పేర్కొంది. 2022-23లో ఏపీ అధిక వినియోగం చేసిన విషయాన్ని జల శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది.