ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు:


* మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు


కళాశాలల వివరాలు:


➥ ఏపీఆర్‌ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలురు), గుంటూరు.


➥ ఏపీఆర్‌ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలురు), కర్నూలు.


➥ ఏపీఆర్‌ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలికలు), వాయల్పాడు. 


గ్రూపుల వారీగా సీట్లు:  ఎంపీసీ- 120, బైపీసీ- 120, సీఈసీ- 105.


సీట్ల సంఖ్య : 345.


అర్హత:  2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 


ఎంపిక ప్రక్రియ:  మైనార్టీ విద్యార్థులకు పదో తరగతి మార్కుల ఆధారంగా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు…


➥ మొదటి దశ దరఖాస్తులకు చివరి తేదీ: 07.06.2023.


➥ మొదటి జాబితా ఫలితాల వెల్లడి:  08.06.2023


➥ రెండో దశ దరఖాస్తులు ప్రారంభం:  10.06.2023.


➥ రెండో జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 19.06.2023.


➥ రెండో జాబితా ఫలితాల వెల్లడి: 20.06.2023.


➥ మూడో దశ దరఖాస్తులు ప్రారంభం:  22.06.2023.


➥ మూడో జాబితా దరఖాస్తులకు చివరి తేదీ:  28.06.2023


➥ మూడో జాబితా ఫలితాల వెల్లడి: 30.06.2023


➥ ప్రవేశాల ముగింపు తేదీ:  30.06.2023..


Notification 


Application


Website


                                     


Also Read:


తెలంగాణ హైకోర్టులో 84 కాపియిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.69 వేల వరకు జీతం!
తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న కాపీస్ట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..