తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన 'బీఆర్ఏజీ ఇంటర్ సెట్-2023' నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 167 గురుకులాల్లో మొత్తం 13,970 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


వివరాలు..


* డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశాలు (బీఆర్‌ఏజీ ఇంటర్ సెట్-2023)


 సీట్ల సంఖ్య: 13,970.


ఇంటర్ గ్రూప్, సీట్లు: ఎంపీసీ- 5,650, బైపీసీ- 5,560, ఎంఈసీ- 800, సీఈసీ- 1600, హెచ్ఈసీ- 360.


అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.


వయోపరిమితి: 31.08.2023 నాటికి 17 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.


పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 25, ఫిజికల్ సైన్స్- 15, బయాలజీ- 15, సోషల్ స్టడీస్- 15, ఇంగ్లిష్- 15, లాజికల్ రీజనింగ్- 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.03.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 16.04.2023.


➥ ప్రవేశ పరీక్ష తేదీ: 23.04.2023.


Notification


Website


Also Read:


డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రా 189 గురుకులాల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


'మోడల్ స్కూల్స్' దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్‌లో) ప్రవేశానికి దరఖాస్తుల గడువును మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు గడువును రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసిన గడువును, మరో వారంరోజులపాటు పొడిగించారు. మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 64,350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఉషారాణి తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..