Vizag Summit Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం 14 కీలక రంగాల్లో అభివృద్ధి కోసం.. రెండు లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందని విశాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మెబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా స్యూటికల్ ఏపీఐ, మెడికల్ డివైసెస్, బ్యాటరీస్, ఆటోమోబైల్స్ కంపోనెన్స్, టెక్నికల్ టెక్స్ టైల్స్ వంటి వరంగాల్లో ఈ పెట్టుబడులను కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. ఇవన్నీ ఇండియాను గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేస్తాయని .. అరవై లక్షలకుపైగాఉద్యోగాలు సృష్టిస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.
ఏపీకి కేంద్రం పూర్తి సహకారం : కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు ఈ విషయంలో కాంపీటీటవ్ ఎడ్వాంటేజ్ ఉందని.. ఈ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఫ్యార్మా స్యూటికల్, మెరైనా ప్రొడక్ట్స్, అక్వా, ఎలక్ట్రానిక్స్, పెెట్రోలియం, ఇంజినరింగ్ తదితర రంగాల్లో ఏపీకి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీ అభివృద్ధి కోసం.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయన్నారు. పోటీ తత్వ ఫెడరలిజంలో ఇది చాలా ముఖ్యమని. అన్ని రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతారణంలో పోటీ పడి పెట్టుబడులు సాధించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి.. రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు.
విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ. 3 వేల కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్నారు. రైల్వేబడ్జెట్‌లో కేంద్రం రా్ట్రానికి రూ. 8406 కోట్లు కేటాయించిందని.. ఇది గత ఏడాది కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువన్నారు. 72 రైల్వేస్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లుగా మారుసుతున్నామన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. విశాఖఫట్నం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ. మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు.
విశాఖ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తామన్న పోర్ట్ అండ్ షిప్పింగ్ మంత్రి
ఇదే సమావేశంలో మరో కేంద్ర మంత్రి షర్బానంద సోనోవాల్ కూడా మాట్లాడారు. పోర్టులు, షిప్పింగ్శాఖ మంత్రి అయిన ఆయన దేశంలోనే విశాఖ ప్రత్యేకనగరంగా నిలిచిందన్నారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమని..శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కలకంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా ఇండియా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.