AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 

Continues below advertisement

ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన బోర్డు ఎగ్జామ్స్‌ను 6,40916 మంది విద్యార్థులు రాశారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22, 074 మంది. వీరిలో బాలురు 3, 28, 652మంది కాగా, బాలికలు 3,12,264 మంది ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ఫలితాల వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ ఇదే 

ఫలితాలు ఎక్కడా చూడాలి

ఫలితాలను చూడటానికి, మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలు పెడుతున్నారు. 

Also Read: టెన్త్ తరవాత ఐటీఐ కోర్స్ చేస్తే, ఈ కేంద్ర సంస్థల్లో జాబ్స్ కొట్టేయొచ్చు

అధికారిక వెబ్‌సైట్‌లు ఇవే

  • bse.ap.gov.in
  • results.bse.ap.gov.in
  • results.apcfss.in
  • results.bie.ap.gov.in
  1. ముందుగా పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లో దేనినైనా ఎంటర్ చేసి విజిట్ చేయాలి.
  2. హోమ్‌పేజీలో కనిపించే SSC Public Examinations March 2026 Result అనే లింక్‌పై క్లిక్ చేయాలి. 
  3. తర్వాత కనిపించిన బాక్స్‌లో విద్యార్థి హాల్ టికెట్ అడిగిన ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. 
  4. తర్వాత సబ్‌మిట్ చేస్తే మీ ఫలితాల స్టాటస్, మార్కుల మెమో మీకు కనిపిస్తుంది. 

ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాల కోసం యూజ్ అవుతుంది. 

వెబ్‌సైట్లపై రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అవి సరిగా స్పందించవనే అభిప్రాయం ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. 

మీరు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ముందుగా 9552300009 నెంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ ఈ నెంబర్‌కు పంపించారు. అక్కడ వచ్చే మెనూలో ఎడ్యుకేషన్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. అందులో ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 

మీ హాల్ టికెట్ నెంబర్ పంపించాల్సి ఉంటుంది. అలా పంపించిన తర్వాత మీకు ఫలితాలు మెసేజ్ రూపంలో వస్తాయి. దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. 

Also Read: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు

డిజిలాకర్‌లో ఫలితాలు

డిజిలాకర్ ద్వారా కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా digilocker.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లేదా మొబైల్ యాప్‌ను కూడా డౌన్‌లో చేసుకోవచ్చు. 

  1. మీ ఆధార్ నెంబర్ , మొబైల్ నెంబర్ ఆధారంగా సైన్ ఇన్ కావాలి. 
  2. అందులో ఎడ్యుకేషన్ సెక్షన్ ఉంటుంది. అందులో BSEAP ను ఎంచుకోవాలి. తర్వాత క్లాస్ X మార్క్‌షీట్‌ ఎంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్, సంవత్సరం టైప్ చేయాలి.
  3. దీని ద్వారా మీరు డిజిటల్ మార్కు మెమోను పొందవచ్చు. 

ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫలితాలు 

ఇంటర్నెట్ అందుబాటులో లేని వారి కోసం ప్రభుత్వం ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు అందిస్తోంది. మీ మొబైల్ నుంచి మెసేజ్ బాక్స్‌లో ఎస్సెఎస్సీ స్పేస్ ఇచ్చి మీ రోల్ నెంబర్ టైల్ చేయాలి. దీనిని 55352 లేదా 56263 నెంబర్‌కు పంపించాలి. వెంటనే మీ సబ్జెక్ట్‌ల వారిగా వచ్చిన మార్కులు రిటర్న్‌ ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. 

Also Read: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్‌ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?

రీ వెరిఫికేషన్- సప్లిమెంటరీ ఎప్పుడు?

ఇప్పుడు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, లేదా రీ కౌంటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. విద్యార్థులు ఫీజులు చెల్లించి వీటికి దరఖాస్తు చేసుకోవాలి. 

ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ వచ్చే నెలలో పరీక్ష పెట్టనుంది. దీని వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉంటుంది.