AP POLYCET 2022 Results: ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలోని గేట్ వే హోటల్‌లో ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏపీ పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/ లోగానీ, http://sbtetap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు..
ఏపీలోని పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పాలిసెట్ నిర్వహించింది. కొన్ని రోజులకే ఏపీ పాలిసెట్-2022 ఆన్సర్ కీ (AP POLYCET 2022 Answer Key)ని కూడా ఎస్‌బీటీఈటీ రిలీజ్ చేసింది. తాజాగా పాలిసెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి ర్యాంక్ కార్డులు, మార్కులను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేటి నుంచే అభ్యర్థులకు ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఏపీ పాలిసెట్ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
మే 29న జరిగిన ఏపీ పాలీసెట్-2022 పరీక్ష (AP POLYCET 2022 )కు ఏపీలో మొత్తం 404 పరీక్ష కేంద్రాలలు, 52 సహాయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పాలీసెట్ కు మొత్తం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.25 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల తమ ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులో ప్రవేశాలు పొందుతారు. మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహించగా, కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారికి ర్యాంకులు కేటాయిస్తారు.
ఉత్తీర్ణత ఇలా..
ఏపీ పాలీసెట్ 2022 ఫలితాల్లో 91.84శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అందులో బాలుర ఉత్తీర్ణత 90.56 శాతం ఉండగా, 93.96 శాతం మంది బాలికలు పాలీసెట్ క్వాలిఫై అయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా మీ మార్కులు, ర్యాంకు కార్డులు పొందవచ్చు.