AP Intermediate Academic Calendar 2022 - 23: ఏపీలో రాబోయే విద్యా సంవత్సరం 2022–23 కి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలు జూలై 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 295 రోజులలో పని దినాలు 220 ఉండగా, 75 రోజులు సెలవు దినాలుగా బోర్డు పేర్కొంది. ఏప్రిల్‌ 21, 2023వ తేదీతో ఇంటర్ స్టూడెంట్స్ విద్యా సంవత్సరం ముగియనుంది.


జూలై 1 నుంచి ఏప్రిల్ 21 వరకు.. 
ఏపీ ఇంటర్ విద్యార్థులకు వచ్చే అకడమిక్ ఇయర్ జూలై 1న మొదలుకాగా, ఏప్రిల్ 21, 2023 చివరి తేదీగా ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి మే 31 తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1, 2023న ఆ తరువాత ఇంటర్ అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 


అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ..
కాలేజీల ఓపెనింగ్ -  జూలై 1, 2022
త్రైమాసిక పరీక్షలు - సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు
దసరా సెలవులు - అక్టోబర్ 2 నుంచి 9 వరకు
కాలేజీల రీఓపెన్ అక్టోబర్ 10
అర్ధసంవత్సరం పరీక్షలు - నవంబర్ 14 నుంచి 17 వరకు
సంక్రాంతి సెలవులు -  2023 జనవరి 11 నుంచి 17 వరకు
రీ ఓపెనింగ్ -  జనవరి 18, 2023
ప్రీఫైనల్ పరీక్షలు -  జనవరి 19 నుంచి జనవరి 25 వరకు
ప్రాక్టినల్ పరీక్షలు -  ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 28 వరకు
థియరీ ఎగ్జామ్స్ -  మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు
లాస్ట్ వర్కింగ్ డే -  ఏప్రిల్ 21, 2023
వేసవి సెలవులు -  ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ -  మే 2023 చివరి వారంలో


Also Read: AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం


ఏపీలో ఈ ఏడాది టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లీకుల వివాదంలో జరిగాయి. అయితే జూన్ 10వ తేదీలోగా ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదివరకే పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 8 నుంచి 10 తేదీల మధ్య ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు విడులయ్యాక, జులై రెండో వారంలో టెన్త్ క్లాస్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది.