AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

AP Inter Revaluation Apply Online: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న విద్యార్థులకు రికౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు వెళ్లే అవకాశం ఉంది.

Continues below advertisement

AP Inter Revaluation 2022 Apply Online: ఏపీలో ఇటీవల ఇంటర్మీడియట్‌- 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయగా.. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 61 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 9,41,358 మందిలో రెగ్యులర్‌‌గా రాసిన విద్యార్థులు 8,69,059 మంది కాగా, వొకేషనల్‌ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు. పరీక్షలు పూర్తయిన 28 రోజుల్లోనే ఇంటర్మీడియట్‌  ఫలితాలను ఏపీ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్‌ వొకేషనల్‌ పరీక్షల్లో ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్ పరీక్షల్లో 55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Continues below advertisement

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు ప్రారంభం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న విద్యార్థులకు రికౌంటింగ్ (AP Inter Recounting), రీ వెరిఫికేషన్ కు వెళ్లే అవకాశం ఉంది. తమ రిజల్ట్స్‌కు సంబంధించి ఏపీ ఇంటర్ విద్యార్థులు మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ (AP Inter Re Verification) దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 25వ తేదీ నుంచి జూలై 5వ తేదీవరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయవచ్చని ఏపీ ఇంటర్ బోర్డ్ సూచించింది. అధికారిక వెబ్ సైట్  https://bie.ap.gov.in/ లో విద్యార్థులు తమ వివరాలతో నేటి నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ.260 చెల్లించాలి. రీ వెరిఫికేషన్ తో పాటు జవాబు పత్రాలు స్కాన్ కాపీల కోసం ఒక్కో పేపర్ కోసం రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్  4,45,604 రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ పరీక్షలకు 4,23,455 మంది హాజరుకాగా... 2,58,446 మంది పాస్‌ అయ్యారని మంత్రి బొత్స వెల్లడించారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాలుర అత్యధిక ఉత్తీర్ణత 66 శాతం కాగా, ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 34 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 72 శాతంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాలికల అత్యధికంగా పాస్ కాగా.. ఉమ్మడి కడప జిల్లా 47 శాతం మంది బాలికలే ఉత్తీర్ణులయ్యారు.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html/amp

ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html/amp

ప్రాక్టికల్స్‌ ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. ఫెయిలైన వారితోపాటు ప్రస్తుతం పాసైన ఇంటర్ విద్యార్థులు సైతం మార్కుల ఇంప్రూవ్‌మెంటుకోసం పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌ కింద పరీక్షలు జరుగుతాయి. గతంలో ప్రభుత్వ కాలేజీలలో 38 శాతం, ప్రైవేటు కాలేజీలలో 65 శాతం మంది విద్యార్థులు చదువుకోగా, ఇప్పుడు ప్రభుత్వం సంస్థల్లో 60 శాతం, ప్రైవేటు కాలేజీలలో 40 శాతం మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Also Read: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

Also Read: Botsa On Inter Results : ప్రతి మండలంలో 2 ఇంటర్ కాలేజీలు - అమ్మఒడి కింద ల్యాప్ ట్యాప్‌లిస్తామన్న బొత్స !

Continues below advertisement