Botsa On Inter Results : ఇంటర్ ఫలితాల్లో ప్రమాణాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాణ ప్రకటించారు. ప్రమాణాలు పెరుగుతున్నందునే రిజల్ట్స్ కూడా పెరుగుతున్నాయి.   కావాల్సిన స్పెషల్ క్లాస్‌లు, మాల్‌ ప్రాక్టీస్‌ ఎంకరేజ్ చేస్తే ఎంతనా రిజల్ట్స్‌ వస్తాయన్నారు.  విద్యా విధానాన్ని సీఎం జగన్ ఆలోచనతో విప్లవాత్మక నిర్ణయంతో రాష్ట్రంలోనే దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దాలని సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.  అన్నింటినీ అప్‌ గ్రేడ్ చేస్తూ ఎక్కడ సమాచార లోపం లేకుండా   కార్యక్రమాలు రూపొందించామన్నారు. 


మండలానికి రెండు ఇంటర్ కాలేజీలు ప్రభుత్వ విధానం !


రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు ఇంటర్ కాలేజీలు ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం 679 మండలాల్లో 474 జూనియర్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని... కొన్ని మండలాల్లో రెండు మూడు ఉంటే... కొన్ని మండలాల్లో అసలు లేవన్నారు.  అలా కాకాకుండా యూనిఫామ్‌గా 679 మండలాల్లో రెండు ప్లస్‌టూ జూనియర్ కాలేజీలు ఉండాలని నిర్ణయించుకున్నామని..  దీనిపై విద్యా శాఖ సమీక్షించుకొని వర్కౌట్ చేస్తున్నామని తెలిపారు.  ఇందులో ప్రతి మండలానికి కో ఎడ్యుకేషన్, ఇంకొకటి బాలికలకు కళాశాల ఉండాలనేదే తమ ప్రభుత్వ విధామని బొత్స స్పష్టం చేశారు.  మొత్తంగా 1358 ఇంటర్ కళాశాలలు ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 


టెన్త్ వరకూ ఉన్న స్కూళ్లలో ఇంటర్ కోర్సులు


పాతవి మినహాయిస్తే ఇందులో  884 కాళాశాలలు నిర్మించాల్సి ఉందని..  ఎక్కడైతే... పదోతరగతి హైస్కూల్స్ ఉన్నాయో ఆ హైస్కూల్స్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ను స్టార్ట్ చేస్తామన్నారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా పని చేస్తున్నామన్నారు.  26 జిల్లాల్లో విద్యార్థులు బాగా చదువుకోవాలనేది తమ ఆలోచన అని..  ఆ ప్రకారమే మా పని తీరు ఉంటుందన్నారు.  ఎక్కడ తక్కువ వచ్చిందో రాబోయ కాలంలో చర్యలు తీసుకుంటామి హామీ ఇచ్చారు.  


టెట్ అయిన తర్వాత అవసరాన్ని బట్టి డీఎస్సీ 


ఉన్న స్టాఫ్‌ను ఉపయోగించుకుంటాం... అవసరమైతే రిక్రూట్‌ చేసుకుంటామని..  డీఎస్సీకి సంబంధించిన ప్రకటన ఉంటుందా అంటే చెప్పలేమన్నారు.  టెట్‌ అయిన తర్వాత అవసరం అయితే డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 65 శాతం ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతుంటే... 45 శాతం ప్రజలు ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే పరిస్థితి వచ్చిందన్నారు.  ప్రభుత్వ కళాశాల్లోల పిల్లలను జాయిన్ చేస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందిని.. మా వద్ద సౌకర్యాలు లేకపోతే ప్రైవేటు వైపు చూడాలన్నారు.  కానీ.. ప్రభుత్వం అన్ని కల్పిస్తోంది కదా.. ఇప్పుడెందుకు ప్రైవేటు కళాశాల్లోల జాయిన్ అవ్వాలని బొత్స ప్రశ్నించారు.  అమ్మఒడి కింద ఈ ఏడాది నుంచే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని బొత్స తెలిపారు.