ఆంధప్రదేశ్‌ ఐసెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌), ఈసెట్‌ (ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఐసెట్‌ (ICET) ఫలితాల్లో 34,789 (91.27 శాతం) మంది.. ఈసెట్‌ (ECET) ఫలితాల్లో 29,904 (92.53 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.  


ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ (ICET) పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించింది. సెప్టెంబరు 17, 18 తేదీల్లో ఐసెట్‌ పరీక్ష జరిగింది. ఏపీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈసెట్ (ECET) 2021 పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 19వ తేదీన ఈసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి బీటెక్ సెకండియర్‌లోకి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 బ్రాంచీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ పరీక్ష కోసం 34,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. 


ఫలితాల డైరెక్ట్ లింక్‌లు ఇవే.. 
1. ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
2. ఐసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


ఐసెట్, ఈసెట్‌ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.. 



1.  sche.ap.gov.inను ఓపెన్ చేయండి. 
2. APICET 2021/ APECET 2021 అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. 
3. దీంతో మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ APICET 2021 / APECET 2021 రిజల్ట్ అని ఉన్న దానిని ఎంచుకోండి. 
4. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి. 
5. వ్యూ రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పరీక్ష ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
6. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి. 


Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..


ఎల్‌పీసెట్‌ ఫలితాల విడుదల కూడా నేడే..



ఆంధ్రప్రదేశ్‌లో లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే లాంగ్వేజ్ పండిట్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌ - LPCET) పరీక్ష ఫలితాలను నేడు (అక్టోబర్ 1) విడుదల చేయనున్నట్లు కన్వీనర్ దుక్కిపాటి మధుసూదన రావు వెల్లడించారు. ఈ నెల 25న జరిగిన ఎల్‌పీసెట్‌ పరీక్షకు మొత్తం 2,086 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తెలుగు భాషా పండిత అర్హత పరీక్షకు 705 మంది, హిందీ భాషా పండిత అర్హత పరీక్షకు 1,381 మంది హాజరైనట్లు తెలిపారు. 



Also Read: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్..


Also Read: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి