Brother Killed His Elder Brother In Srikakulam: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. తన టీ షర్ట్ ధరించిన తమ్ముడిని అన్న ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అన్నను నెట్టేయగా తలకు రాయి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్ (31), సురేశ్ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ ను సురేష్ ధరించాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయగా.. అన్న రమేశ్ ను తమ్ముడు సురేశ్ నెట్టేశాడు. దీంతో రమేశ్ తలకు రాయి తగిలి తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే బాధితున్ని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతి చెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Srikakulam News: టీ షర్ట్ ఎంత పని చేసింది? - అన్నను నెట్టేసిన తమ్ముడు, చివరకు!
ABP Desam | 05 Apr 2024 03:23 PM (IST)
Andhrapradesh News: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. టీ షర్ట్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసి ఒకరి మరణానికి కారణమైంది.
టీషర్ట్ విషయంలో వివాదం